ఈ కరోనా కల్లోలం లేకుంటే పవన్ కళ్యాణ్ తన 26వ చిత్రం పూర్తి చేసి 27వ చిత్రంను క్రిష్ దర్శకత్వంలో శరవేగంగా పూర్తి చేసేందుకు షూటింగ్ లో పాల్గొనేవాడు. ఇప్పటికే పవన్ 27వ చిత్రం ఒక షెడ్యూల్ ను క్రిష్ పూర్తి చేసిన విషయం తెల్సిందే. పీరియాడిక్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్లుగా ఇప్పటికే వార్తలు వచ్చాయి. మంచి కోసం దొంగగా పోరాడే వ్యక్తి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
సినిమాకు సంబంధించిన ప్రతి విషయం కూడా చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక ఈ చిత్రంకు దర్శకుడు క్రిష్ విరూపాక్ష అనే టైటిల్ ను రిజిస్ట్రర్ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కొత్త వార్తలు పుట్టుకు వస్తున్నాయి. పూర్తి స్క్రిప్ట్ ను పట్టుకుని దర్శకుడు క్రిష్ పవన్ డేట్ల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలో ఇలాంటి విపత్తు వచ్చి పడినది.
లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే షూటింగ్స్ కు పవన్ హాజరు అయ్యేది లేనిది చెప్పలేని పరిస్థితి. ఈ సమయంలో షూటింగ్ కు పవన్ హాజరు అయితే రాజకీయంగా విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది అంటున్నారు. కనుక కనీసం ఒక నెల రోజులు అయినా గ్యాప్ తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. ఈ గ్యాప్ లో పింక్ సినిమాను వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.