పవన్ కళ్యాణ్ మెజర్మెంట్స్ తీసుకోవాలన్న బాలయ్య.. అన్ స్టాపబుల్ 2 ప్రోమో అదుర్స్..!

Update: 2023-01-15 07:28 GMT
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా సక్సెస్ ఫుల్ గా దూసుకెళ్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2లో ఆడియన్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న క్రేజీ ఎపిసోడ్ ఒకటి త్వరలో రాబోతుంది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విత్ బాలయ్య బాబు. హోస్ట్ గా బాలయ్య.. గెస్ట్ గా పవన్ ఈ కాంబినేషన్ ని అసలు ఏమాత్రం ఊహించని ఫ్యాన్స్ కి ఈ ఎపిసోడ్ ఐ ఫీస్ట్ అందిస్తుందని చెప్పొచ్చు. పవన్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ షూటింగ్ ఎప్పుడో పూర్తి కాగా అసలైతే సంక్రాంతికి ఈ ఎపిసోడ్ రిలీజ్ చేస్తారని అనుకున్నారు.

కానీ సంక్రాంతికి వీర సింహా రెడ్డి టీం ఇంటర్వ్యూ రిలీజ్ చేసింది ఆహా టీం. బాలయ్య విత్ పవన్ కళ్యాణ్ ప్రోమోతోనే సూపర్ అనిపించేశారు. ప్రోమోలో కేవలం బాలకృష్ణ ఒక్క డైలాగ్ మాత్రమే వదిలారు. అది కూడా ఈయన మెజర్మెంట్స్ తీసుకోవాలని అన్నారు బాలకృష్ణ. అన్ స్టాపబుల్ షో తో బాలయ్య అన్ స్టాపబుల్ గా దూసుకెళ్తుండగా ఈ పవన్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది.

పవన్ కళ్యాణ్ కూడా ఈ షోని ఫుల్ గా ఎంజాయ్ చేసినట్టు తెలుస్తుంది. ఇంతకీ పవన్ బాలయ్య ఈ స్పెషల్ చిట్ చాట్ ఎలా సాగింది. పవన్ ని ఎలాంటి ప్రశ్నలు బాలయ్య అడిగారు. అసలు వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఎలాంటిది. వీటన్నిటికీ సమాధానం త్వరలో దొరుకుతుంది. అన్ స్టాపబుల్ షో లో ఇప్పటివరకు చాలామంది గెస్ట్ లు రాగా పవన్ ఎంట్రీ మాత్రం నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు. పవర్ స్టార్, నందమూరి నట సింహం ఇద్దరు కలిసి చేసే రచ్చ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ అంతా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

మొన్న వచ్చిన ప్రభాస్ ఎపిసోడ్ కే ఆహా సర్వర్ హ్యాంగ్ అవ్వగా ఇక పవన్ ఎపిసోడ్ వస్తే సర్వర్ ఒకటి రెండు గంటలు కాదు పూర్తిగా హ్యాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకైనా మంచిది ఆహా టీం ఈ హ్యాంగ్ లు గట్రా లేకుండా టెక్నికల్ గా ముందు ఏర్పాటు చేసుకుంటే బెటర్ అని చెప్పొచ్చు. పవన్ బాలయ్య ఎపిసోడ్ మరోసారి ఆడియన్స్ కి మెగా ట్రీట్ అందిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.


Full View
Tags:    

Similar News