బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ పరంగా స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే. రాజకీయాలకు కొంత బ్రేక్ నిచ్చి సెట్స్ పై ఉన్నవాటిని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రీకరణ పూర్తయి.. ఏప్రిల్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాకి ప్రీబిజినెస్ అదిరిపోయిందన్న టాక్ ఉంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో దిల్ రాజు- బోనీకపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మరోవైపు క్రిష్ దర్శకత్వంలో పవన్ హిస్టారికల్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పవన్ స్నేహితుడు ఏ.ఎం.రత్నం అత్యంత భారీ బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారని పాన్ ఇండియా కేటగిరీలో మూవీని రిలీజ్ చేయనున్నారని ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్టే బిజినెస్ వర్గాల్లో హైప్ నెలకొంది. ఇప్పటికే ఫార్స్ ఫిలింస్ సంస్థ విదేశీ రిలీజ్ హక్కుల కోసం 5 కోట్లు అడ్వాన్స్ ఇచ్చిందని కమీషన్ బేసిస్ లో రిలీజ్ చేస్తోందని సమాచారం. ఇదే గాక.. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఏరియాల హక్కుల్ని కొందరికి రిజర్వ్ చేసేసారన్న టాక్ కూడా వినిపిస్తోంది.
2022 సంక్రాంతి రేసులో ఫేవరెట్ మూవీగా పవన్ - క్రిష్ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆ క్రమంలోనే వేగంగా బిజినెస్ కూడా పూర్తవుతోందట. దీనిని బట్టి క్రైసిస్ అనే బెంగ ఎక్కడా కనిపించడం లేదని అర్థమవుతోంది. 2022 సంక్రాంతి అంటే ఇంకా 9నెలలు ఉంది కాబట్టి టెన్షన్ పడేదేమీ లేదని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే వందశాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు నమోదవుతున్నాయి కాబట్టి పవర్ స్టార్ క్రేజుతో పాన్ ఇండియా హిట్ కొట్టేయొచ్చన్న అంచనాతోనే బయ్యర్లలో స్పీడ్ కనిపిస్తోందిట.