ఈ శుక్రవారం రిలీజైన ‘గరుడవేగ’కు అన్ని వైపులా పాజిటివ్ టాకే వచ్చింది. ఈ సినిమా గురించి ఎవ్వరూ నెగెటివ్ గా మాట్లాడట్లేదు. బయట చూసినా.. సోషల్ మీడియాలో చూసినా.. అందరూ ఈ సినిమాను పొగిడేస్తున్నారు. కానీ ఇంత మంచి టాక్ ఉన్న సినిమాకు తొలి రోజు వసూళ్లు చూస్తే చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఫస్ట్ డే కోటి రూపాయల షేర్ కూడా రాలేదని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
ఈ సినిమాకు చాలా తక్కువ థియేటర్లు ఇవ్వడం.. మార్నింగ్ షో.. మ్యాట్నీలకు వసూళ్లు చాలా నామమాత్రంగా ఉండటం దీనికి కారణంగా తెలుస్తోంది. సాయంత్రానికి సినిమా పుంజుకుని ఫుల్స్ పడ్డా కూడా షేర్ అంత తక్కువగా ఉందంటే.. ఈ చిత్రాన్ని ఎంత తక్కువ థియేటర్లలో రిలీజ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఐతే రెండో రోజుకు థియేటర్లు, షోలు పెరగడంతో వసూళ్లు పెరిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ఐతే ఎంత పుంజుకున్నప్పటికీ రూ.30 కోట్ల దాకా పెట్టుబడి పెట్టిన సినిమాకు ఎంత మేర రికవరీ అవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. సినిమాకు ముందు నుంచి పాజిటివ్ బజ్ ఉన్నప్పటికీ గత కొన్నేళ్లలో రాజశేఖర్ మార్కెట్ బాగా దెబ్బ తిన్న నేపథ్యంలో బయ్యర్లు నిర్మాత చెప్పిన రేట్లకు సినిమాను కొనలేదు. దీంతో తక్కువ మొత్తాలకే సినిమాను అమ్మారు. కొన్ని ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వసూళ్లు ఎంత పుంజుకున్నా కానీ.. పెట్టుబడి ఏమేరకు రికవర్ అవుతుందన్న సందేహాలు కలుగుతున్నాయి. మరి ఈ సినిమా ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.