ఇటీవలి కాలంలో దక్షిణాది పరిశ్రమలో ట్రెండ్ మారింది. ఫిలింమేకింగ్‌లో కొత్త పరిణామం చోటు చేసుకుంది. ఫాంటసీ, ఫిక్షన్, జానపదం అంటూ భారీ బడ్జెట్ సినిమాల్ని తీస్తున్నారు. ఆ తరహాలోనే మూడు సినిమాలు త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. బాహుబలి, రుద్రమదేవి 3డి, పులి రిలీజ్‌కి రెడీ అవుతున్న సినిమాలు. వీటిలో ఏ సినిమాకి ఎంత క్రేజు? అన్న చర్చోపచర్చలు సాగుతున్నాయి.
అంతేనా ఇప్పటికే ప్రభాస్ బాహుబలి చిత్రం భారీ స్థాయిలో మార్కెట్‌ను కొల్లగొట్టింది. రిలీజ్‌కి ముందే నిర్మాతలకు లాభాల్ని తెచ్చిపెడుతోంది. అయితే ఓ బాలీవుడ్ వెబ్‌సైట్ ప్రకారం ఈ మూడు సినిమాల్లో ఆన్‌లైన్ వ్యూస్ ఎక్కువ ఏ సినిమాకి వచ్చాయి? అని సర్వే చేస్తే .. విజయ్ 'పులి' టాప్ పొజిషన్‌లో నిలిచింది. పులికి 48శాతం వ్యూస్ వస్తే, బాహుబలికి 47శాతం వ్యూస్ వచ్చాయి. అయితే ఈ రెండిటితో పోలిస్తే 'రుద్రమదేవి 3డి' చిత్రానికి చాలా లీస్ట్ వ్యూస్ వచ్చాయి. కేవలం 4శాతం వ్యూస్ మాత్రమే వచ్చాయని సదరు వెబ్‌సైట్ సర్వేని రివీల్ చేసింది.
చింబుదేవన్ దర్శకత్వంలో తెరకెక్కిన పులి చిత్రంలో విజయ్ రెండు డిఫరెంట్ గెటప్పుల్లో కనిపించబోతున్నాడు. రాబిన్‌హుడ్ తరహా పాత్రలో, హెర్క్యులస్ తరహా పోరాట యోధుడిలా కనిపించబోతున్నాడు. అయితే లుక్ విషయంలో బాహుబలిని కొట్టే సీనే లేదు. విఎఫ్‌ఎక్స్ ఇతరత్రా విషయాల్లోనూ బాహుబలిని ఇంచ్ కూడా టచ్ చేయలేదు.
వాస్తవానికి ఈ సర్వే కేవలం అభిమానుల్లో ఉన్న క్రేజును మాత్రమే ప్రతిఫలించేది. వసూళ్ల రేంజు ఎలా ఉంటుంది? అన్నది సినిమాలో ఉన్న కంటెంటే తేలుస్తుంది. ఏ సినిమా అయినా నాలుగు వారాలు పైగా థియేటర్లలో ఆడితేనే దానికి క్రేజు ఉన్నట్టు. కేవలం ట్రైలర్లు, పోస్టర్లకు వ్యూస్ వచ్చినంత మాత్రాన అవే వసూళ్లు అనుకోవడం మూర్ఖత్వం. అదీ సంగతి.