పులి సేఫేన‌ట‌గా?!

Update: 2015-10-02 05:49 GMT
విడుద‌ల‌కు ముందు ప్రేక్ష‌కుల్లో భారీగా హైప్ క్రియేట్ చేసుకొన్న సినిమాల్లో `పులి` ఒక‌టి. `బాహుబ‌లి` త‌ర్వాత మ‌ళ్లీ ఆ స్థాయి విజువ‌ల్ ఎఫెక్ట్స్‌ తో తెర‌కెక్కిన సినిమా అని ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో అంతా `పులి` గురించి మాట్లాడుకోవ‌డం మొద‌లుపెట్టారు. దానికితోడు విజ‌య్‌ లాంటి మాస్ హీరో అందులో ఉండ‌టం కూడా `పులి` శ‌ర‌వేగంగా హైప్ క్రియేట్ చేసుకొంది. ఆ హైప్ మూలాన విడుద‌ల‌కు ముందే వంద కోట్ల బిజినెస్ చేసుకొన్న‌ట్టు స‌మాచారం. సౌత్ ఇండియాలో ఇలా హ‌య్య‌స్ట్ బిజినెస్ చేసుకొన్న సినిమాల్లో `పులి` ఒక‌టిగా నిలిచిపోయింది. సుమారు 3వేల‌కిపైగా థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేసింది యూనిట్‌.

అయితే అనుకోకుండా సినిమా విడుద‌ల‌కు ముందు రోజు విజ‌య్ ఇంటిపై ఇంక‌మ్ ట్యాక్స్ అధికారులు దాడులు చేయ‌డంతో `పులి`  సినిమా కొన్ని చోట్ల విడుద‌ల కాలేక‌పోయింది. అయినా స‌రే విడుద‌లైన ప్రాంతాల్లో ఓపెనింగ్స్ మాత్రం భారీగా వ‌చ్చాయ‌ట‌. తొలి రోజు 30కోట్ల పైచిలుకు వ‌సూళ్లు ఈ సినిమా సొంత‌మైన‌ట్టు తెలుస్తోంది. సినిమాని కూడా త‌క్కువ బ‌డ్జెట్‌ లోనే తెర‌కెక్కించార‌ని స‌మాచారం. మొద‌ట్లో వంద కోట్ల‌కు పైచిలుకు వ్య‌యం అన్నారు కానీ... 80కిమించి అవ్వ‌లేదట‌. మొద‌ట్లో బాహుబ‌లి స్టైల్‌ లో  యుద్ధం స‌న్నివేశాలు తీయాల‌నుకొన్నార‌ట. కానీ ఆ ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకొని  మామూలు యాక్ష‌న్ సీక్వెన్స్‌ తో స‌రిపెట్టార‌ని తెలిసింది.

దీంతో సినిమాకి పెద్ద‌గా పెట్టుబ‌డి అవ‌స‌రం కాలేద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మూడు భాష‌ల్లో అమ్ముడ‌యిన థియేట‌రిక‌ల్ రైట్స్‌ తోనే సినిమాకి 80కోట్ల‌దాకా ముంద‌స్తు బిజినెస్ జ‌రిగిపోయింద‌ని స‌మాచారం. అంటే పెట్టిన పెట్టుబ‌డి తిరిగొచ్చేసింద‌న్న‌మాట‌. ఇంకా శాటిలైట్ రైట్స్  నుంచి వ‌చ్చే డ‌బ్బు అద‌నం అన్న‌మాట‌. విజ‌య్ ఎన్ని క‌ష్టాల్లో ఇరుక్కుపోయినా, `పులి`ని ఎంత బాహుబ‌లితో పోల్చి చూసుకొని నిరాశ‌ప‌డినా సినిమా మాత్రం సేఫ్ ప్రాజెక్టు అయ్యింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అదే బ‌డ్జెట్ అదుపు త‌ప్పుంటే మాత్రం న‌ష్టాలొచ్చేవ‌ని, ఇప్పుడు ఆ గండం నుంచి గ‌ట్టెక్కిన‌ట్టే అని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.
Tags:    

Similar News