రాహుల్ - పునర్నవి.. ప్రపోస్ వరకు వెళ్ళిందే

Update: 2019-08-09 10:58 GMT
తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 చిన్న చిన్న గొడవలు.. సరదా సన్నివేశాలు.. అప్పుడప్పుడు రొమాంటిక్‌ సన్నివేశాలతో దూసుకు పోతుంది. మూడవ వారం కూడా ముగింపుకు వచ్చేసింది. ఇక ఇంట్లో సభ్యుల విషయానికి వస్తే వరుణ్‌ సందేశ్‌.. వితిక.. పునర్నవి.. రాహుల్‌ లు ఒక బ్యాచ్‌ అయ్యారు. వీరు నలుగురు కూడా ఎప్పుడు ఒక గ్రూప్‌ లా ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. వరుణ్‌ వితికలు భార్య భర్తలు అవ్వడంతో వారి మద్య రొమాన్స్‌ ఓ రేంజ్‌ లో ఉంటుంది. ఇదే సమయంలో పునర్నవి మరియు రాహుల్‌ ల మద్య ఏదో ట్రాక్‌ నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది.

పోయిన వీకెండ్‌ లో నాగార్జున వచ్చిన సమయంలో రాహుల్‌ ను సేవ్‌ చేసిన సమయంలో ఈమద్య అతడు డేటింగ్‌ లో కూడా ఉన్నాడు అంటూ పండు అనడం జరిగింది. డేటింగ్‌ అనగానే రాహుల్‌ వైపు అంతా చూస్తూ పునర్నవి పేరు ఎత్తారు. ఆ తర్వాత రాహుల్‌ తో చాలా మంది పునర్నవితో ట్రాక్‌ నడుపుతున్నావా అంటూ సరదాగా ఆట పట్టించారు. ఇక బిగ్‌ బాస్‌ మెయిన్‌ ఎపిసోడ్‌ లో చూపించని కంటెంట్‌ తో బిగ్‌ బాస్‌ బజ్‌ అంటూ స్టార్‌ మ్యూజిక్‌ లో ప్రసారం చేస్తున్నారు. అందులో రాహుల్‌ మరియు పునర్నవిల క్లిప్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతుంది.

ఆ వీడియోలో పునర్నవితో రాహుల్‌ మాట్లాడుతూ రేపు పొద్దున బయటకు పోయిన తర్వాత ఒక రింగ్‌ ఇచ్చి నీకు ప్రపోస్‌ చేస్తే ఏమంటావు అంటూ ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా పునర్నవి ఫస్ట్‌ నేనేంటో తెలుసుకో అంటూ సమాధానం ఇచ్చింది. నేను జోక్‌ గానే అడుగుతున్న సీరియస్‌ గా తీసుకోకుండా ఒకవేళ రింగ్‌ ఇచ్చి ప్రపోస్‌ చేస్తే ఏం చేస్తావు చెప్పు అంటూ మరోసారి ప్రశ్నించాడు. దానికి పునర్నవి పో.. పోయి పని చూసుకో అంటూ సమాధానం ఇస్తానంది.

ఇక ఇద్దరి మద్య ప్రవర్తన కూడా చాలా విభిన్నంగా ఉంది. పునర్నవి కాలుతో రాహుల్‌ ను సరదాగా తన్నడం.. అతడు కూడా ఆమె ప్రవర్తనను చాలా లైట్‌ తీసుకోవడం... ఇద్దరు ఎక్కువ సేపు మాట్లాడుకోవడం వంటివి చేస్తున్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్‌ లో పునర్నవి కనిపించకుండా పోయిన సమయంలో రాహుల్‌ వద్దకు తమన్నా వెళ్లి పునర్నవి లేదుగా ఇప్పుడైనా మాతో మాట్లాడొచ్చుగా అంటూ ఆట పట్టించడం వంటివి చూస్తుంటే ఇద్దరి మద్య చాలా ఎక్కువగా సంభాషణలు జరుగుతున్నాయని.. ఇద్దరు ముందు ముందు మరింత సీరియస్‌ గా ట్రాక్‌ లో పడే అవకాశం ఉందని బిగ్‌ బాస్‌ ను ఫాలో అయ్యే ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
    
    
    

Tags:    

Similar News