వీడియో: హాట్ యోగా సెషన్ తో పిచ్చెక్కిస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ..!

Update: 2022-06-22 07:30 GMT
పునర్నవి భూపాలం.. తెలుగు సినీ, టీవీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అప్పుడెప్పుడో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల ముద్దుగుమ్మ.. 'బిగ్ బాస్' తెలుగు రియాలిటీ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. కెరీర్ ప్రారంభంలో 'ఉయ్యాలా జంపాలా' 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' చిత్రాలలో కీలక పాత్రలలో నటించిన పున్నూ.. 'పిట్టగోడ' సినిమాతో హీరోయిన్ గా మారింది.

ఆ తర్వాత ‘మనసుకు నచ్చింది’ ‘ఈ సినిమా సూపర్ హిట్’ ‘ఎందుకో ఏమో’ వంటి పలు చిత్రాల్లో నటించింది కానీ.. ఆశించిన గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. అయితే 'బిగ్ బాస్' తెలుగు సీజన్-3 రియాలిటీ షోలో పాల్గొనే అవకాశాన్ని అందుకొని అంద‌రి దృష్టి ఆక‌ర్షించింది పున‌ర్న‌వి.

'బిగ్ బాస్' హౌస్‌ లోకి వెళ్లిన తర్వాత పున్నూ తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలిచేది. ముక్కుసూటిగా మాట్లాడుతూ ఫైర్ బ్రాండ్‌ గా పేరు తెచ్చుకుంది. సినిమాల్లో సంప్రదాయ వస్రధారణలో కనిపించే పునర్నవి.. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో బిగ్ బాస్ హౌజ్ ని హీటెక్కించిందనే చెప్పాలి.

హౌస్ లో సింగర్ రాహుల్ సిప్లీగంజ్‌ తో కలిసి ఆమె నడిపిన ట్రాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమికుల్లా వ్యవహరిస్తూ వీరు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఏదైతేనేం వీరి కెమిస్ట్రీ కుర్రకారుకు బాగా కనెక్ట్ అయింది.. టైటిల్ గెలకవకపోయినా బయటకు వచ్చాక ఊహించని స్థాయిలో క్రేజ్ దక్కించుకుంది పున్నూ. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

'బిగ్ బాస్' నుంచి వచ్చిన తర్వాత కొన్ని సినిమాలు - వెబ్ సిరీస్ లలో పున‌ర్న‌వి నటించింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రతి విషయాన్ని ఫాలోవర్స్ తో పంచుకుంటూ వస్తోంది. అదే సమయంలో హాట్ హాట్ అందాల‌తో మంత్ర‌ముగ్ధుల‌ని చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో హాట్ వీడియోతో వచ్చింది.

నిన్న మంగళవారం యోగా డే సందర్భంగా 'యోగా ఫర్ వెల్ నెస్' అంటూ పున్నూ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది. మామూలుగా యోగ చేస్తే కిక్ ఏం ఉంటుందనుకుందేమో.. ఈ బ్యూటీ రివర్స్ లో L షేప్ లో భంగిమ ట్రై చేసింది. దీనికి ఓ రకమైన సౌండ్ ను కూడా జత చేసింది. ఈ వీడియోలో ఆమె థైస్ అందాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.


Full View
Tags:    

Similar News