లక్షలాది మంది అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేస్తూ కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నిన్న ఉదయం (అక్టోబర్ 29) గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. పునీత్ భౌతికకాయాన్ని బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోకి తీసుకువచ్చారు. అక్కడ అతని కుటుంబ కోరిక మేరకు అతని తండ్రి రాజ్ కుమార్ సమాధి పక్కన ఖననం చేయనున్నారు. పునీత్ తల్లి పార్వతమ్మను కూడా స్టూడియో ఆవరణలోనే ఖననం చేశారు.
కాగా పునీత్ పెద్ద కుమార్తె వందిత రాజ్ కుమార్ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన అంత్యక్రియలను ఆదివారం పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు తమ అభిమాన హీరో అప్పూని చివరిసారిగా చూసేందుకు నివాళులు అర్పించేందుకు వేలాది మంది అభిమానులు కంఠీరవ స్టేడియంకు చేరుకుంటున్నారు. మరోవైపు నిన్నటి నుంచి రాష్ట్రం మొత్తం హై అలర్ట్ గా ఉంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మద్యం దుకాణాలు- విద్యాసంస్థలు- సినిమా థియేటర్లు మూసివేశారు. ఈ రెండు రోజులు కర్నాటకలో హై అలెర్ట్ కొనసాగనుంది.
పునీత్ రాజ్ కుమార్ శాండల్వుడ్ ని సుమారు రెండు దశాబ్ధాల పాటు తనదైన ఛరిష్మాతో ఏలారు. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. అతడు నటించిన కన్నడ సినిమాలు తెలుగులో అనువాదమై రిలీజైన సంగతి తెలిసిందే. 46 ఏళ్ల వయసులో ఆయన స్వర్గానికేగారు.