కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. 25 ఏళ్ల కెరీర్ లో 30 సినిమాలు, వందల కోట్లు వసూలు చేసే హీరో గుండె చప్పుడు ఆగిపోవడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.46 ఏళ్లకే గుండెపోటుతో పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని పలువురు తట్టుకోలేకపోతున్నారు. కర్ణాటకలో హైఅలెర్ట్ ప్రకటించారు.
అయితే పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు మరింత ఆలస్యం కానున్నాయి. ఆయన కూతురు వచ్చాకే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అమెరికాలో ఉన్న కూతురు వందిత వచ్చిన తర్వాతే అంత్యక్రియలు జరుగనున్నాయి.
ప్రభుత్వ అధికార లాంఛనాలతో పునీత్ అంత్యక్రియలు జరుగనున్నాయి. పునీత్ రాజ్ కుమార్ భౌతికకాయం ప్రస్తుతం కంఠీరవ స్టేడియంలో ఉంచారు. కూతురు వచ్చాక ఆమెను అక్కడకు తీసుకొని వెళ్లి చూసిన తర్వాత అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు.
ప్రస్తుతం బెంగళూరు అంతా దిగ్బ్రాంతికర వాతావరణం నెలకొని ఉంది. అభిమానులు అప్పూ అప్పూ అంటూ వేలాదిగా తరలివస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం అలెర్ట్ ప్రకటించారు. 6వేల మంది పోలీసులతో సెక్యూరిటీని పర్యవేక్షిస్తున్నారు.