అప్పు డ్రీమ్ ప్రాజెక్ట్ `గంధ‌ద‌గుడి` టీజ‌ర్‌ ఇదిగో

Update: 2021-12-06 11:33 GMT
ఎంతో మంది పుడుతుంటారు.. చ‌నిపోతుంటారు కానీ కొంత మంది మాత్ర‌మో చ‌నిపోయినా ఎప్ప‌టికీ బ్ర‌తికే వుంటారు. అలాంటి వ్య‌క్తుల్లో క‌న్న‌డ ప‌వ‌ర్‌ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఉరాఫ్ అప్పు ఒక‌రు.

ఇటీవ‌ల ఈ క‌న్న‌డ స్టార్ వ్యాయామం చేస్తూ హార్ట్ ఎటాక్ రావ‌డంతో చిన్న వ‌య‌సులోనే ఈ ప్ర‌పంచాన్ని వ‌దిలి తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయిన విష‌యం తెలిసిందే. అభిమానులు ముద్దుగా అప్పు అని పిలుచుకునే పునీత్ లేడ‌న్న నిజాన్ని ఆయ‌న అభిమానులే కాదు.. ఆయ‌న గురించి తెలిసిన వారు ఇప్ప‌టికీ న‌మ్మ‌డం లేదు.

నిస్వార్థంగా ఎలాంటి పేరుని ఆశించ‌కుండా సేవ చేయాలో ఈ ప్ర‌పంచానికి చాటిన ఏకైక వ్య‌క్తి పునీత్ రాజ్ కుమార్‌. ఆయ‌న 18 వంద‌ల మందిని చ‌దివిస్తున్నార‌ని.. ఎంతో మంది వృద్ధుల కోసం ఆశ్ర‌మాల్ని క‌ట్టించి వాటి నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల్ని చేప‌ట్టార‌ని అప్పు చ‌నిపోయేంత వర‌కు ఈ ప్ర‌పంచానికి తెలియ‌లేదంటే ఆయ‌నది ఎంత గొప్ప మ‌న‌సో అర్థం చేసుకోవ‌చ్చు.

ఆయ‌న తుది శ్వాస విడిచి అప్పుడే 39 డేస్ అవుతోంది. ఈ నేప‌థ్యంలో అప్పు న‌టించిన ఆయ‌న డ్రీమ్ ప్రాజెక్ట్ `గంధ‌ద‌గుడి` టైటిల్ టీజ‌ర్ ని సోమ‌వారం విడుద‌ల చేశారు.

ఇదొక డాక్యుమెంట‌రీ. దీని గురించి అక్టోబ‌ర్ 27 అంటే అప్పు చ‌నిపోవ‌డానికి రెండు రోజుల ముందు తానే స్వ‌యంగా వివ‌రిస్తూ ఓ ఫొటోని షేర్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ గురించి ఆరోజు రాత్రి 6:02 గంట‌ల‌కు ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఆ ట్వీట్ నెట్టింట వైర‌ల్ గా మారింది. ఓ ప‌క్క హీరోగా న‌టిస్తూనే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాల‌ని నిర్మిచారు పునీత్ రాజ్ కుమార్ `గంధ‌ద‌గుడి` డాక్యుమెంట‌రీని అమోఘ వ‌ర్ష జే. ఎస్ తో క‌లిసి చేశారు. ఇది పునీత్‌ కు చాలా చాలా స్పెష‌ల్‌. ఒక విధంగా చెప్పాలంటే ఆయ‌న డ్రీమ్ ప్రాజెక్ట్‌.

అమోఘ‌వ‌ర్ష రూపొందించిన `వైల్డ్ క‌ర్ణాట‌క‌`ని చూసి ఇంప్రెస్ అయిన పునీత్ రాజ్ కుమార్ క‌ర్ణాట‌క కోస్ట్‌కి సంబంధించిన డాక్యెమెంట‌రీని త‌న‌తో చేయాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌.

పునీత్ రాజ్ కుమార్ మ‌ద‌ర్ పార్వ‌త‌మ్మ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని `గంధ‌ద‌గుడి` టైటిల్ టీజ‌ర్ ని టీమ్ సోమ‌వారం విడుద‌ల చేసింది. `మ‌న ప్ర‌జ‌ల‌కు.. మ‌న భూమికి నివాళిగా ద‌శాబ్దాల క్రితం ఓ క‌థ పుట్టింది. ఇది రాబోయే త‌రాల‌కు స్ఫూర్తినిస్తుంది. ఒక లెజెండ్‌ ని మ‌ళ్లీ మ‌న ముందుకు వ‌చ్చే స‌మ‌యం వ‌చ్చింది` అంటూ `గంధ‌ద‌గుడి` టీమ్ అప్పూని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ నెట్టింట వైర‌ల్‌ గా మారింది.

ట్రూ ఈవెంట్స్ ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంట‌రీ టైటిల్ టీజ‌ర్ ని చూసిన వారంతా క‌ర్ణాట‌క ఫారెస్ట్‌ లో పునీత్ తిరిగిన దృశ్యాల‌ని చూసి క‌న్నీటి ప‌ర్యంత మ‌వుతున్నారు. అప్పు స‌ర్ లేరంటే ఇప్ప‌టికీ న‌మ్మ‌బుద్ది కావ‌డం లేద‌ని.. ఆయ‌న ఇప్ప‌టికీ మ‌న మ‌ధ్యే వున్నార‌ని చెబుతున్నారు.


Full View
Tags:    

Similar News