కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. కనీసం అయిదు పదుల వయసు కూడా లేని ఆయన ఇంత హఠాత్తుగా మరణించడంను ఏ ఒక్కరు కూడా తట్టుకోలేక పోతున్నారు. ఆయన మరణించిన సమయంలో జనాలు ఏ స్థాయిలో బెంగళూరు లోని కంఠీరవ స్టేడియం మరియు స్టూడియో వద్ద కు చేరుకున్నారో తెల్సిందే. ఆయన మృతిని నమ్మలేక పోతున్నాం అంటూ కన్నీరు పెట్టుకున్నారు. అంతటి అభిమానంను దక్కించుకున్న పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన సమయంలో రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఆ రెండు సినిమాల్లో మొదటిది జేమ్స్. చిన్న చిన్న యాక్షన్ సన్నివేశాలు మినహా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యింది. ఆ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలని భావించారు.
జేమ్స్ సినిమాను ఇప్పుడు డిసెంబర్ లో విడుదల చేయట్లేదని నిర్మాతలు చెప్పారు. వచ్చే ఏడాది పునీత్ రాజ్ కుమార్ బర్త్ డే సందర్బంగా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. కేవలం కన్నడంలోనే కాకుండా పునీత్ రాజ్ కుమార్ కు గౌరవం చేకూర్చేలా భారీ పాన్ ఇండియా మూవీగా జేమ్స్ ను విడుదల చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారని తెలుస్తోంది. జేమ్స్ సినిమాకు వచ్చిన పెద్ద సమస్య కన్నడంలో ఆయన పాత్రకు డబ్బింగ్. పునీత్ రాజ్ కుమార్ పాత్రకు వేరే భాషలో అయితే ఎవరితోనో ఒకరితో చెప్పించవచ్చు. కాని కన్నడంలో మాత్రం ఆయన వాయిస్ లేకుండా డబ్బింగ్ చెప్పించడం అంటే కష్టమైన విషయం. అందుకే ముంబయికి చెందిన ఒక ప్రముఖ సౌండ్ ఇంజనీరింగ్ సంస్థ ను జేమ్స్ మేకర్స్ కలిశారని తెలుస్తోంది.
జేమ్స్ ఆన్ లొకేషన్ లో షూటింగ్ సమయంలో పునీత్ రాజ్ కుమార్ చెప్పిన డైలాగ్స్ ను పెట్టేయాలని నిర్ణయించారు. ఆన్ లొకేషన్ సౌండ్ నుండి పునీత్ రాజ్ కుమార్ వాయిస్ ను వేరు చేసే బాధ్యతను వారు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తెలుగు లో కూడా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలని నిర్ణయించారు. పునీత్ గత చిత్రం యువరత్న ను తెలుగు లో భారీగానే విడుదల చేయడం జరిగింది. కాని తెలుగు లో ఆశించిన స్థాయిలో సక్సెస్ ను మాత్రం ఆ సినిమా అందుకోలేదు. కాని పునీత్ రాజ్ కుమార్ కు తెలుగు లో మొదటి సారి గుర్తింపు అయితే లభించింది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పునీత్ చనిపోయిన తర్వాత వస్తున్న ఆయన సినిమా అవ్వడం వల్ల ఖచ్చితంగా జేమ్స్ కు తెలుగులో మంచి ఆధరణ ఉండే అవకాశాలు లేకపోలేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.