పూరీకి అందుకే నో చెప్పా: పీపూల్ స్టార్

Update: 2019-10-25 06:15 GMT
పీపూల్ స్టార్ ఆర్ నారాయ‌ణ‌మూర్తి వేవ్ త‌గ్గి ఉండొచ్చు. కానీ ఆయ‌న గ‌తం ఎప్ప‌టికీ చిర‌స్మ‌ర‌ణ‌య‌మే.  ఇప్ప‌టికీ త‌న పంథాలోనే బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల కోణంలో క‌థ‌ల్ని ఎంచుకుని సినిమాలు చేస్తూ శ‌హ‌భాష్ అనిపించుకుంటున్నారు. విప్ల‌వం ఉద్య‌మం గిరి పుత్రులు అంటూ ఆయ‌న‌కంటూ ఒక జోన‌ర్ ఎప్ప‌టికీ వ‌ద‌ల‌రు. 37 ఏళ్లుగా సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్నారు. ఎన్నడు తాను న‌మ్మిన సిద్దాంత‌ల‌ను మాత్రం వీడ‌లేదు. అందుకే ఆర్ నారాయ‌ణ‌మూర్తి సినిమాలంటే  అభిమానుల్లో ప్ర‌త్యేక‌మైన గుర్తింపు. ప‌రిమిత బ‌డ్జెట్  ప్ర‌య‌త్నాలు అత‌న్ని విజ‌య‌తీరాల వైపు న‌డిపాయి. సినిమాలు త‌గ్గిన క్ర‌మంలో కామ్రేడ్ కి ఎంతో మంది ద‌ర్శ‌కులు అవ‌కాశాలిచ్చిన సంద‌ర్భాలున్నాయి. కానీ ఆయ‌న మాత్రం సున్నితంగానే తిర‌స్క‌రించారు. అలా మూర్తిగారికి ఛాన్స్ ఇచ్చిన వారిలో స్టార్ డైరెక్ట‌ర్ పూర్తి జ‌గ‌న్నాథ్ ఒక్క‌రు.

టెంప‌ర్ సినిమాలో పోసాని కృష్ణ ముర‌ళి పోషించిన కానిస్టేబుల్ పాత్ర‌కు ముందుగా ఆర్. నారాయ‌ణ‌మూర్తినే పూరి అనుకున్నాడు. అత‌న్ని దృష్టిలో పెట్టుకునే ఆ రోల్ ని అంత ప‌వ‌ర్ ఫుల్ గా డిజైన్ చేసిన‌ట్లు పూరి ప‌లు ఇంట‌ర్వూల్లో చెప్పుకొచ్చారు. కానీ అవ‌కాశాన్ని నారాయ‌మ‌ణ‌మూర్తి సున్నితంగా తిర‌స్క‌రించాడు. దీంతో అత‌ని పై  సోష‌ల్ మీడియాలో చాలా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. సినిమా అవ‌కాశాలు లేక‌పోయినా నారాయ‌ణ‌మూర్తికి అంత బెట్టు ఎందుకు అని విమ‌ర్శించారు. అలాంటి రోల్ చేస్తే నారాయ‌ణ‌మూర్తి లైఫ్ మారిపోతుంద‌ని చాలా క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. అయితే త‌న బాణీకి వ్య‌తిరేకంగా ఉండే ఏ పాత్ర‌ను ఆయ‌న అంగీక‌రించరు. పూరీని టెంప‌ర్ ని పొగిడేసిన మూర్తిగారు .. తాను ఆ పాత్ర‌ను చేయ‌లేన‌ని అన్నారు.

తాజాగా తాడెప‌ల్లి గూడెం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న ఓ ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వూలో అందుకు గ‌ల కార‌ణాల‌ను మ‌రోసారి ప‌ర్టిక్యుల‌ర్ గా వెల్ల‌డించారు. పూరి మంచి ద‌ర్శ‌కుడు. ఆయ‌న చిత్రంలో న‌టించ‌క‌పోవ‌డానికి  ఓ  కార‌ణం ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ నేను హీరో ఓరియేంటెడ్ రోల్స్ మాత్ర‌మే చేసాను. తిరిగి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్  పాత్ర చేయ‌డానికి నా మ‌న‌సు ఒప్పుకోలేదు. అంతే త‌ప్ప పూరి ఆఫ‌ర్ ని గ‌ర్వం త‌ల‌కెక్కి తిర‌స్క‌రించ‌లేదని వివ‌ర‌ణ ఇచ్చారు. ప్ర‌స్తుతం లైఫ్ బాగానే ఉంద‌ని.. దానికి వ‌చ్చిన ఢోకా ఏం లేద‌ని త‌న దైన శైలిలో తెలిపారు.
Tags:    

Similar News