మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ స్టార్ హీరోనే కాదు అంతకు మించి సక్సెస్ పుల్ దర్శకుడిగా తొలి సినిమాతోనే నిరూపించుకున్నారు. కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ కథానాయకుడిగా `లూసీఫర్` చిత్రాన్ని తెరకెక్కించి తొలి ప్రయత్నతం బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మలయాళంలో స్టార్ హీరోగా వెలిగిపోతున్న పృథ్వీరాజ్ అనూహ్యంగా కెప్టెన్ బాధ్యతల్ని చేపట్టి..అందులోనూ భారీ విజయాన్ని అందుకుని అందర్నీ ఆశ్చపరిచారు. అదే కాన్పిడెన్స్ తో మోహన్ లాల్ తో రెండవ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
`బ్రో డాడి ` టైటిల్ తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ని కూడా పృథ్వీరాజ్ మెరుపు వేగంతో పూర్తి చేసారు. కేవలం 44 రోజుల్లోనే చిత్రీకరణ మొత్తం పూర్తి చేసారు. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలోనే ఎక్కువ భాగం చిత్రీకరణ జరిగింది. కీలక సన్నివేశాలన్ని హైదరాబాద్ లోనే షూట్ చేసినట్లు యూనిట్ వెల్లడించింది. ఈ సందర్భంగా పృథ్వీరాజ్ సోషల్ మీడియా వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేసారు. దర్శకుడిగా రెండవ చిత్రమిది. మోహన్ లాల్ కెమెరా ముందు చాలా సరదగా ఉంటారు. ఎంతో మంచి మనిషి. నిర్మాత అంథోనీ పెరుంబవూర్ నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబడతానని ధీమా వ్యక్తం చేసారు.
ఇంకా ఈ చిత్రంలో అద్భుతమైన నటీనటులు భాగమయ్యారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు అని అన్నారు. ఇంకా ఈ చిత్రంలో పృథ్వీరాజ్..మీనా..కళ్యాణి ప్రియదర్శన్.. ఉన్ని ముకుందన్..లాలూ అలెక్స్..మురళీ గోపీ.. కనీహా..సాబిన్ షాహిర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. ఇక పృథ్వీ రాజ్ హీరోగా 12 చిత్రాలు లైన్ లో ఉన్నాయి. అంటే 2022 వరకూ ఆయన డేట్లు కూడా దొరకని పరిస్థితి. ఇంత బిజీగా ఉన్నా అటు సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు. మొత్తానికి షూటింగ్ లు పూర్తి చేయడంలో పృథ్వీరాజ్ టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రికారుపైనే కన్నేసినట్లు కనిపిస్తుంది. గతంలో పూరి ఓ సినిమా షూటింగ్ ని ఏ కంగా 30 రోజుల్లోనే పూర్తి చేసిన సంగతి తెలిసిందే.