రామ్ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ చక్కని ఓపెనింగులు సాధించిన సంగతి తెలిసిందే. తొలి వీకెండ్ నాటికే బయ్యర్లు సేఫ్ అవుతారన్న టాక్ తో పూరి బృందం సెలబ్రేషన్స్ మోడ్ లోకి వెళ్లిపోయింది. ఇస్మార్ట్ సెలబ్రేషన్స్ పేరుతో ఊరూ వాడా ప్రచారానికి రెడీ అవుతోంది. హైదరాబాద్- వైజాగ్- విజయవాడ- తిరుపతి అన్నిచోట్లా సక్సెస్ టూర్లు ప్లాన్ చేసింది ఇస్మార్ట్ టీమ్.
మరోవైపు పూరి జగన్నాథ్ టీవీ చానెళ్ల ఇంటర్వ్యూలతోనూ బిజీ అయిపోయారు. రాక రాక దక్కిన విజయమిది. అరడజను ఫ్లాపుల తర్వాత చిన్నపాటి రిలీఫ్ దొరికింది. దీంతో పూరి చాలా హ్యాపీగా ఉన్నారు. తనని బ్యాడ్ ఫేజ్ లో ఉన్నప్పుడు దూరం పెట్టిన హీరోల గురించి గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో మహేష్ హీరోగా `జనగనమన` ప్రారంభిస్తున్నామని ప్రకటించినా అది సెట్స్ కెళ్లలేదు. తాను బ్యాడ్ ఫేజ్ లో ఉన్నప్పుడు మహేష్ సహకరించకపోవడాన్ని పూరి తప్పు పట్టారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పూరి ఆ అంశంపై ఓపెన్ అయ్యారు. సక్సెస్ లేని దర్శకులతో మహేష్ ఎప్పుడూ పని చేయరని.. కేవలం సక్సెస్ ఉంటేనే నటిస్తారని వ్యాఖ్యానించారు. అయితే ఆ వార్త ప్రధానంగా హెడ్ లైన్స్ లోకి రావడంతో అది కాస్తా మహేష్ అభిమానుల్లోనూ చర్చకు వచ్చింది.
ఇక ఇదే వివాదం విషయంలో ఓ యాంకర్ తాజా ఇంటర్వ్యూలో పూరీని గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. కానీ పూరి ఎందుకనో ఆ వివాదాన్ని కొనసాగించేందుకు ఆసక్తిని కనబరచలేదు. వివాదాలు అనవసరం అనే ధోరణిని కనబరిచారు. మొత్తానికి మహేష్ విషయంలో పూరి తగ్గారనే ఈ సన్నివేశం చెప్పింది. అంటే మహేష్ తో పూరి సన్నాహిత్యాన్నే కోరుకుంటున్నారా? ఏదైనా స్క్రిప్టు వినిపించమని మహేష్ ఫోన్ చేసి అడిగితే పూరి వెళ్లేందుకు రెడీయేనా? పోకిరి.. బిజినెస్ మేన్ రోజుల్ని తిరిగి తెస్తాడా? హిట్టొచ్చిన వేళ తిరిగి తన పాత ఫామ్ ని కొనసాగించే ఉత్సాహంలో ఉన్నాడు. మునుముందు స్టార్ హీరోలకు కథలు వినిపించేందుకు అతడు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే నటసింహా నందమూరి బాలకృష్ణతో సినిమా చేసేందుకు పూరి ఆసక్తిగా ఉన్న సంగతి తెలిసిందే.