విజయ్ దేవరకొండ హీరోగా మైత్రి సంస్థ నిర్మించిన `డియర్ కామ్రేడ్` ఇటీవల రిలీజైన సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి మిశ్రమ స్పందనలకు తగ్గట్టే బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోవడంలో తడబడింది. అయితే ఈ సినిమా తర్వాత కూడా మైత్రి సంస్థకే దేవరకొండ కమిటైన సంగతి తెలిసిందే. తెలుగు.. తమిళంలో `హీరో` అనే భారీ చిత్రాన్ని ప్రారంభించారు. బైక్ రేసింగ్ నేపథ్యంలో ఆసక్తికర కథాంశాన్ని ఎంచుకున్నారు. దిల్లీలో కొంత భాగం చిత్రీకరణ సాగిందని వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఔట్ పుట్ సరిగా రాకపోవడంతో ఆగిపోయిందని ప్రచారమైంది.
అయితే వీటన్నిటికీ సమాధానమిచ్చేందుకు మైత్రి సంస్థ సిద్ధమవుతోందని సమాచారం. హీరో సినిమా ఆగిపోలేదు. త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. ఆ మేరకు అధికారికంగా వివరాలు వెల్లడిస్తారట. మరోవైపు విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి-ఛార్మి నిర్మించనున్నారు. `ఇస్మార్ట్ శంకర్` సక్సెస్ తో ట్రాక్ లోకి వచ్చిన పూరి జగన్నాథ్ రెట్టించిన ఉత్సాహంతో ఈ సినిమా చేయబోతున్నారట. ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ఖాయమైందని నిర్మాత ఛార్మి సామాజిక మాధ్యమాల్లో స్వయంగా ప్రకటించారు. త్వరలోనే నటీనటులు సహా సాంకేతిక నిపుణుల వివరాల్ని వెల్లడిస్తారట.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి కేవ్ లో రెగ్యులర్ గా కథా చర్చలు సాగిస్తున్నారు. దేవరకొండకు సరిపడే స్క్రిప్టుని తీర్చిదిద్దే పనిలో పూరి కాంపౌండ్ ఉందని తెలుస్తోంది. `హీరో` ప్రాజెక్టు పూర్తయ్యాకే ఈ సినిమా ఉంటుందా? అంటే అవునని వినిపిస్తోంది.