ఆక‌లితో దొరికాడు స‌రే.. హిట్టొస్తుందా?

Update: 2019-07-08 06:29 GMT
టాలీవుడ్ డైరెక్ట‌ర్ల‌లో పూరి జ‌గ‌న్నాథ్ టేకింగ్‌.. మేకింగ్ స్టైల్ ప్ర‌త్యేకం. ఆయ‌న స్పీడుని అందుకోవ‌డం ఎవ‌రికీ సాధ్యం కాని ప‌ని. కానీ అలాంటి ద‌ర్శ‌కుడు గ‌త కొంత కాలంగా స‌రైన హిట్ లేక ట్ర‌బుల్స్ ని ఎదుర్కొంటున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్‌ తో చేసిన `టెంప‌ర్` సినిమా త‌రువాత పూరీకి స‌రైన హిట్ ద‌క్క‌లేదు. హిట్టు అంద‌ని మావి అయ్యింది. కెరీర్ లో ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాల్ని అందించిన ద‌ర్శ‌కుడిగా పూరీజ‌గ‌న్నాథ్ కు ట్రాక్ రికార్డ్ వుంది. అందుకే అత‌డు తిరిగి రీబూట్ అవుతాడా? ఇస్మార్ట్ హిట్ అందుకుంటాడా? అంటూ ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

తాజాగా ఓ స‌మావేశంలో ముచ్చ‌టించిన పూరి ఇస్మార్ట్ శంక‌ర్ స‌క్సెస్ పై ధీమాను క‌న‌బ‌రిచారు. `టెంప‌ర్‌` త‌రువాత తనకు స‌రైన హిట్ రాలేద‌ని, మంచి హిట్ కోసం ఆక‌లితో ఎదురుచూస్తున్న త‌న‌కు రామ్ లాంటి హీరో దొరికాడ‌ని పూరి చెప్పుకొచ్చారు. రామ్ వెజిటేరియ‌న్ ముసుగులో వున్న నాన్ వెజిటేరియ‌న్‌. త‌ను రామ్ పోతినేని కాదు చిరుత‌పులి. రామ్‌ కి సినిమా త‌ప్ప మ‌రో ధ్యాస లేదు. పార్టీలు, ఫ్రెండ్స్ అనే ధ్యాస అస‌లే లేదు. స‌హాయ ద‌ర్శ‌కుడు పిల‌వ‌క‌ముందే షాట్లో దూకుతాడు`` అంటూ అత‌డి క్వాలిటీస్ గురించి గొప్ప‌గానే ప‌గిడేశారు పూరి.

ఇదే వేదిక‌పై రామ్ కూడా పూరి గురించి ఓ రేంజ్‌లో ప్ర‌శంస‌లు కురిపించారు. ఎవ‌రెన్ని చెప్పినా పూరితో క‌లిసి ప‌నిచేస్తే వ‌చ్చే కిక్కే వేరు. ఇంత‌కు ముందు చిత్రాల‌కంటే ఈ సినిమాకు ఎక్కువ క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది. అయితే ఆ క‌ష్టాన్ని నిర్మాత‌ ఛార్మి త‌న ప్లానింగ్‌ తో మ‌ర్చిపోయేలా చేశారు. సినిమాలో అన్నీ వుండాలి కానీ కొత్త‌గా వుండాలి!! అని అనుకున్న స‌మ‌యంలో పూరిని క‌లిశాను. అప్పుడు పుట్టిన ఆలోచ‌నే ఇస్మార్ట్ శంక‌ర్‌ అని రామ్ ఈ సినిమాపై త‌నకున్న కాన్పిడెన్స్ ని వ్య‌క్తం చేశారు. పోస్ట‌ర్లు ఆక‌ట్టుకున్నా టీజ‌ర్ కి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌చ్చాయి. హాలీవుడ్ మూవీ కిల్ల‌ర్ కి కాపీ క‌థాంశ‌మ‌ని క్రిటిక్స్ విమ‌ర్శించారు. అలాగే ఓ ర‌చ‌యిత ఈ క‌థ నాదీ అంటూ ర‌చ‌యిత‌ల సంఘంలో ఫిర్యాదు చేశారు. అదంతా స‌రే అనుకుంటే.. రామ్ ఆహార్యం.. యాస‌..  నైజాం మాస్ కి క‌నెక్ట‌వుతుంద‌ని అనుకుంటే ఇక్క‌డ యూత్ లో ఆ యాస విష‌యంలో వ్య‌తిరేక‌త నెల‌కొంది. మ‌రి ఈనెల 18న రిలీజ‌వుతున్న ఇస్మార్ట్ శంక‌ర్ ఎలాంటి ఫ‌లితాన్ని అందుకోబోతోంది? అన్న‌ది వేచి చూడాల్సిందే.


    
    
    

Tags:    

Similar News