ఆముదం తాగ‌మ‌న్న పూరి.. క‌రోనా మెడిసినా?

Update: 2020-03-22 06:30 GMT
స్టార్ డైరెక్ట‌ర్ పూరి పంచ్ ల గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. ఆయ‌న పంచ్ లు బుల్లెట్ల మాదిరిగా దూసుకుపోతాయి. ఇట్టే యూత్ కి క‌నెక్ట‌యిపోతాయి. పోకిరి .. చంటిగాడు.. గంగ‌తో రాంబాబు.. బిజినెస్ మేన్ ఒక‌టేమిటి ఆయ‌న సినిమాల్లో వెతికితే అమృత గుళిక‌ల్లాంటి పంచ్ లు ఎన్నో ఎన్నెన్నో. స్వీయానుభ‌వాల‌తో డైలాగులు రాయ‌డం పూరి శైలి. అందుకే అంత క‌సి ఉంటుంది వాటిలో. అదంతా స‌రే కానీ.. పూరి విసిరిన తాజా క‌రోనా పంచ్ విన్నారా? అదిరిపడ‌తారంతే. ఇంత‌కీ పూరి ఏమ‌ని పంచ్ వేశారు? అంటే...

ఈ ఆదివారం నాడు ఇళ్ల‌లోంచి జ‌నం బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా జ‌న‌తా క‌ర్ఫ్యూకి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న పిలుపున‌కు అండ‌గా..పూరి అదిరిపోయే సందేశ‌మే ఇచ్చాడు. క‌రోనా నియంత్ర‌ణ కోసం అంద‌రూ స‌హ‌క‌రించాల్సిందిగా కోరుతూ .. నేడు తాను కూడా ఇంట్లోనే ఉండిపోతున్నాన‌ని చెప్పాడు. ఇక జ‌న‌తా క‌ర్ఫ్యూ గురించి నెగెటివ్ గా మాట్లాడ‌వ‌ద్ద‌ని పూరి త‌న వీడియో సందేశంలో కోరాడు. బ‌య‌ట‌కు వెళతాను.. ఇంట్లో ఉండ‌లేను అని  అని నెగిటివ్‌గా మాట్లాడేవాళ్లు.. ఆముదం తాగండి! అంటూ ఆయన సలహా కూడా ఇచ్చారు. పూరి మాట్లాడుతూ.. ``ఎందుకు చెప్పారో.. మన ప్రధానమంత్రిగారు చెప్పిన మాట విందాం. ఆదివారం అందరం ఇంట్లోనే ఉందాం. ఇలా ఉంటే ఆ కరోనా వైరస్ తాలుకూ చైన్ కట్ అవుతుందని పెద్దలందరి అభిప్రాయం. వారి మాటను గౌరవించి ఇంట్లోనే ఉందాం. కొంత మంది నేను ఇంట్లో ఉండలేను అని నెగిటివ్ గా మాట్లాడేవాళ్లకి.. ఫ్రస్టేట్ అయ్యేవాళ్లకి నా సలహా ఏమిటంటే.. ఆదివారం ఉదయం లేవగానే నాలుగు స్ఫూన్లు ఆముదం తాగండి. మోషన్స్ అవుతాయి. ఇక ఆ పనిలో బిజీగా ఉంటారు. సాయంత్రం అయిపోతుంది. హ్యాపీగా ఉంటది. నేడంతా ఇంట్లోనే ఉండండి`` అని కోరారు.

అసలు కరోనా లేని ప్లేస్ కి ఎవరైనా వెళ్లాలి అనుకుంటే ఒక ఊరు ఉంది. ఆ ఊరు వూహాన్. చైనాలో కరోనా వస్తే.. దేశం మొత్తం కట్టగట్టుకుని కరోనాని చావకొట్టారు. అందుకే మనం కూడా ఆ పని చేయాలనుకుంటే.. చెప్పిన మాట వినండి అని కాస్త ఎమోష‌న‌ల్ అయ్యాడు పూరి. అంతా బాగానే ఉంది కానీ.. పూరీ ఒక విష‌యాన్ని మాత్రం అస్స‌లు ప్ర‌స్థావించ‌లేదేమిటో?  క‌రోనా త‌న‌ని బ్యాంకాక్ వెళ్ల‌కుండా ఎంత‌గా నిలువ‌రించింది?! ఇంత‌కీ ఈ ఖాళీ స‌మ‌యంలో క‌థ‌లేమైనా రాస్తున్నారా? పూరీ స‌ర్ కాస్త చెప్పండి ప్లీజ్!
Tags:    

Similar News