లైగర్ సినిమా అనుకున్నది ఒకటైతే అయ్యింది మరోటి. పదుల కోట్ల లో లాభాలు వస్తాయని ఛార్మి మరియు పూరిలు భారీ మొత్తంలో ఖర్చు చేసి నిర్మించిన విషయం తెల్సిందే.
విజయ్ దేవరకొండ కూడా పూర్తి పారితోషికాన్ని తీసుకోకుండా అడ్వాన్స్ పారితోషికం ను మాత్రమే తీసుకుని సినిమాను చేశాడు. తీరా సినిమా విడుదల అయిన తర్వాత కనీసం 30 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేక పోయిందంటూ కామెంట్స్ వచ్చాయి.
ఆగస్టు 25న విడుదలైన ఈ సినిమా ను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ సమయంలో డిస్ట్రిబ్యూటర్లు తమకు న్యాయం చేయాలంటూ నిర్మాతకు విజ్ఞప్తి చేయడంతో ఆయన ఈనెల 30వ తారీకు వరకు కొంత మొత్తంలో అయినా లావాదేవీలకు సంబంధించిన లెక్కలు సెటిల్ చేస్తాను అన్నట్లుగా హామీ ఇచ్చాడట. పూరి జగన్నథ్ అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నాడని సమాచారం అందుతోంది.
ఇక లైగర్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో జనగణమన సినిమాను ప్రస్తుతానికి వాయిదా వేసే ఉద్దేశ్యంతో పూరి జగన్నాథ్ ఉన్నాడట. అదే విషయాన్ని విజయ్ దేవరకొండ మరియు పూరిలు చర్చించుకున్నారని కూడా సమాచారం అందుతోంది. లైగర్ ఫ్లాప్ నుండి బయట పడేందుకు కాస్త సమయం కావాలి అన్నట్లుగా పూరి జగన్నాథ్ తదుపరి సినిమాకు గ్యాప్ తీసుకుంటాడట.
లైగర్ సినిమా మేకింగ్ సమయంలో ముంబై లో మకాం వేసిన పూరి జగన్నాథ్ ఇప్పుడు గోవా షిప్ట్ అయ్యే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. తప్పకుండా ఒక మంచి సినిమా తో కమ్ బ్యాక్ అవ్వాలని పూరి జగన్నాథ్ భావిస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాదిలో పూరి కొత్త సినిమా ఉంటుదనే వార్తలు వస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.