పూరీ జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కిన ''లైగర్'' మూవీ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా రిజల్ట్ తో 'జనగణమన' సినిమాపై నీలినీడలు అలుముకున్నాయనే కామెంట్స్ వినిపించాయి.
'లైగర్' సినిమా విడుదలకి ముందే విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాథ్ కాంబోలో "JGM" అనే టైటిల్ తో మరొక మూవీని ప్రకటించారు. ఇది పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పబడింది. పూరి కనెక్ట్ మరియు శ్రీకర స్డూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని అఫీషియల్ గా లాంచ్ చేశారు. దీనికి ఛార్మి కౌర్ - దర్శకుడు వంశీ పైడిపల్లి లను నిర్మాతలుగా పేర్కొన్నారు.
'జనగణమన' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో 2023 ఆగస్టు 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే ని హీరోయిన్ గా తీసుకున్నారు. వీరితో రెండు షెడ్యూల్స్ షూటింగ్ కూడా చేశారు. అయితే ఇప్పుడు 'లైగర్' సినిమా ప్లాప్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ ను పూర్తిగా పక్కన పెట్టేసారనే వార్తలు వస్తున్నాయి.
'లైగర్' డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాధ్ మరియు 'జనగణమన' నిర్మాతలు మై హోమ్ గ్రూప్ మధ్య బడ్జెట్ మరియు తదుపరి ప్రణాళికల గురించి చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. మేకర్స్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మరియు మొదటి రెండు షెడ్యూల్స్ షూటింగ్ కోసం 20 కోట్ల రూపాయలు వరకూ ఖర్చు చేసినట్లు టాక్ ఉంది.
అయితే అనేక చర్చల తర్వాత ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికంగా లాభదాయకంగా లేదని భావించిన మై హోమ్ గ్రూప్.. ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ మరియు పూరీ జగన్నాథ్ కలిసి JGM చిత్రాన్ని పూర్తిగా పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యారని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని మేకర్స్ దృవీకరించాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే పూరీ తదుపరి ప్రాజెక్ట్ ఏంటనేది అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇదిలా ఉంటే పూరీ జగన్నాథ్ 'లైగర్' సినిమా నష్టాలను భర్తీ చేసే ప్రయత్నాలు చేపట్టనున్నారని టాక్. ప్రస్తుతం ముంబైలో ఉన్న పూరీ.. ఈ వారాంతంలో తిరిగి హైదరాబాద్ కు వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లను కలుసుకోనున్నారట. వారికి 30 శాతం నష్టపరిహారం చెల్లించాలని పూరీ భావిస్తున్నారట.
'లైగర్' సినిమాపై హైప్ దృష్ట్యా అన్ని ఏరియాలలో భారీ రేట్లకే విక్రయించారు. నైజాం రైట్స్ తీసుకున్న డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను పెద్ద మొత్తంలో నష్టపోయాడు. అలానే మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ భారీగా నష్టాలు వచ్చాయి. ఇప్పుడు పూరీ జగన్నాథ్ తమ బాధ్యతగా కొంత మొత్తం వెనక్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి.