'నా దగ్గర పదేళ్లకు సరిపడా కథలు ఉన్నాయ్' అంటూ పూరి జగన్ మొన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతే కాకుండా.. ఏకంగా 'రోగ్' సినిమాను చూసి సల్మాన్ ఖాన్ చాలా ఇంప్రెస్ అయిపోయాడని.. సూరజ్ పాంచోళి (అనుమానస్పద రీతిలో చనిపోయిన హీరోయిన్ జియా ఖాన్ ప్రియుడు)ని హీరోగా పెట్టి సినిమాను హిందీలో రీమేక్ చేసేస్తాడని సెలవిచ్చాడు. బాబు పూరి గారు.. ఇంకెన్నాళ్ళూ జనాలు ఫూల్స్ అయిపోతున్నారని మీరు ఇలాంటి జోకులు వేస్తారు?
రోగ్ సినిమాలో కథ కథనం లేకపోవడం ఒకెత్తయితే.. ఇక కేవలం అమ్మాయిలను ఇష్టమొచ్చినట్లు తిట్టడమే పనిగా పెట్టుకోవడం మరో ఎత్తు. కాసేపు సినిమా చూశాక.. మన కర్మ ఏనాడో కాలిపోయి ఇలా టిక్కెట్ కొనుక్కొని ఇటొచ్చాం కాని.. లేకపోతేనా.. ఈ వందతో చక్కగా ఒక మిని పిజ్జా తిని కూల్ డ్రింక్ తాగేసి ఉండొచ్చు అనుకోను ప్రేక్షకుడు ఉండడేమో. ఇలాంటి సోది సినిమాను చాలా కంఫర్టబుల్ గా ఆడియన్స్ కు అమ్మేయడం అంటే.. పూరి జగన్ లోని రైటర్ అండ్ డైరక్టర్ కాకుండా బిజినెస్ మ్యాన్ స్వైర విహారం చేస్తున్నాడనే చెప్పాలి. దీనిని రీమేక్ చేస్తున్నారని చెప్పడం అంటే.. అంతకంటే ఘోరం ఇంకోటి ఉండదు.
కనీసం రోగ్ కొట్టిన దెబ్బతోనైనా పూరి జగన్ కళ్ళు తెరుచుకోవాలని అని ఎవరైనా అనుకుంటున్నారేమో కాని.. పూరి సంగతి అటుంచితే.. ఆయన సినిమాలను కొంటున్న పంపిణీదారులు మాత్రం కళ్ళు తెరుచుకోవాలి అంటూ ట్రేడ్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి. చూద్దాం మరి ఫైనల్ గా ఈ సినిమా ఎలాంటి నష్టాలను మిగిల్చి ఎలాంటి గుణపాఠాలు నేర్పిస్తుందో!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/