పూరి @ 50.. ఏ మాత్రం పవర్ తగ్గలేదు

Update: 2016-09-28 11:30 GMT
ఇప్పుడు తెలుగు దర్శకల్లో డైనమిక్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ ఎవరంటే.. ఎవరైనా కూడా వెంటనే పూరి జగన్ పేరే చెబుతారు. ముఖ్యంగా ఆయన మార్కు హీరోయిజమ్ చూపించాలంటే ఎవ్వరి తరమే కాదు. అందుకే హిట్టొచ్చినా ఫ్లాపొచ్చినా పూరి అంటే ఒక స్పెషల్ పర్సన్ గానే అందరూ చూస్తారు.

అంతే కాదు.. ఆయన తనలోని ఫిలసాఫికల్ థింకింగ్ అంతా కూడా తన హీరోల ద్వారా సమాజానికి చెప్పేస్తాడు. తన బద్రి అయినా.. ఈడియట్ అయినా.. శివమణి ఏంది అనేసినా.. లేకపోతే అసిస్టెంట్ డైరక్టర్ నేనింతే అని చెప్పినా.. జ్యోతి లక్ష్మి తిట్టినా.. లోఫర్ ఏడ్చినా.. అవన్నీ కూడా ఒక స్టయిల్లో ఉంటాయి. అలాంటి డైనమిక్ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్ అయిన పూరి జగన్.. ఈ రోజు (సెప్టెంబర్ 28) తన 50వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. కొత్త క్లబ్ లోకి ఆయన అడుగుపెడుతున్నా కూడా.. సినిమా లవర్స్ మాత్రం ఆయనకు 50 అంటే నమ్మలేకపోతున్నారు.

నిజజీవితంలో తనకు నెగెటివ్ థాట్స్ తెప్పించే విషయాలను పట్టించుకోకపోవడం.. 15 రోజుల్లో కథ-మాటలు రాసేయడం.. ఒంటినిండా టాటూలు వేయించుకోవడం.. ఇలా ఎంత ఫాస్టుగా ఉంటారో.. ఆయన సినిమాల్లోని హీరోలు కూడా అంతే స్పీడుగా ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే పూరి వ్యక్తిత్వమే బహుశా తన హీరోల క్యారెక్టర్ల ద్వారా బయటకొస్తుందేమో. అంతే కాదు.. ఆయన సినిమాలతో చాలామంది హీరోల స్టార్ స్టాటస్ ఉన్నపలంగా మారిపోయింది. రవితేజ - మహేష్‌ - ప్రభాస్.. ఇప్పుడు కళ్యాణ్‌ రామ్.. ఇలా అందరూ ఆయన చేతిలో పడ్డాక భారీగా మారిపోతారు. అది పూరి మార్కు పంచ్.

50 సంవత్సరాల పడిలోకి అడుగెడుతున్నా కూడా.. ఇప్పటికీ పూరిలోని పవర్ మాత్రం తగ్గలేదు. ఇంకా యువదర్శకులు ఆయన్ను ఢీ-కొట్టాలంటే కష్టమే అన్నట్లుంది యవ్వారం. ప్రత్యేకంగా పలానా హీరోతో చేయాలి అనేంత కోరికలు ఏవీ పూరి జగన్ కు లేవు కాని.. మెగాస్టార్ చిరంజీవితో మాత్రం ఒక్క సినిమా అయినా చేయాలి అంటూ పూరి చాలాసార్లు చెబుతుంటారు. ఆయన కోరికలన్నీ నెరవేరాలని ఆశిస్తూ.. ఆయనకు 50వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News