పూరి కూతురు.. కట్.. యాక్షన్

Update: 2017-08-30 07:29 GMT
టాలీవుడ్ లో ఎంత మంది గొప్ప దర్శకులున్నా దర్శకుడు పూరి జగన్నాథ్ మాత్రం చాలా ప్రత్యేకమని చెప్పాలి. తనదైన శైలిలో సినిమాలు తీస్తూ.. ఒక హీరోను ఆకర్షించే విధంగా చూపించే రెండు నెలల్లోనే సినిమాను పూర్తి చేసే సత్తా ఉన్న దర్శకుడు. జయాపజయాలతో సంబంధం లేకుండా అందరి హీరోలతో ప్రయోగాలు చేసే ఈ హీరో  రామ్ గోపాల్ వర్మ శిష్యుడిగా ఒక్కోసారి సంచలాన్ని సృష్టించి అందరిని షాక్ కి గురి చేస్తాడు.

అయితే ఈ దర్శకుడిలో మంచి ఫ్యామిలీ పర్సన్ కూడా ఉన్నాడు. అంతే కాకుండా  చిన్న తనం నుండే తన కొడుకు ఆకాష్ ని వెండి తెరకు అలవాటు చేశాడు. అతనికి 20 దాటితే ఇక పూరి ఆకాష్ తో తియ్యడానికి రెడీగా ఉన్నాడట. అందుకోసం కొన్ని కథలను కూడా రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పూరి కూతురు పవిత్ర కూడా చిన్నప్పుడు చైల్డ్ యాక్టర్ గా చేసింది కాబట్టి.. ఇప్పుడు హీరోయిన్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు. తండ్రికి సంబందించిన ఏ సినిమా వేడుకలో అయినా దర్శనమిచ్చి హీరోయిన్ అవుతుందా ఏంటి అనేలా ఆలోచింపజేస్తోంది. కానీ ఆమె హీరోయిన్ అవ్వదట.

తండ్రి లాగే దర్శకత్వ బాధ్యతలను నిర్వహిస్తుందట పవిత్ర పూరి. అంతే కాకుండా పైసా వసూల్ సినిమాకి ఆమె అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారట. ఇక ఆమె కూడా త్వరలో పూరి ప్రొడక్షన్ లో సినిమా మొదలెట్టడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి మరో బడా దర్శకుడి ఫ్యామిలీ టాలీవుడ్ ని ఏలబోతోందనమాట.  
Tags:    

Similar News