నేనింతే అంటున్న పూరి

Update: 2018-06-16 17:30 GMT
‘‘ఎక్కడైనా నా తీరింతే.. ఏ సెంటరయినా నా స్టయిలింతే.. నచ్చకుంటే నీ ఖర్మంతే...’’ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా నటించిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ పోకిరి సినిమాలోని సమరమే సాంగ్ మధ్యలో వినిపించే లైన్లివి. కాస్త అతిశయోక్తిగా అనిపించినా పూరి జగన్నాథ్ ప్రస్తుత వర్కింగ్ స్టయిల్ కు ఈ పాటలోని ఈ లైన్లు కరెక్ట్ గా సరిపోతాయి.

పూరి జగన్నాథ్ హిట్ డైరెక్టర్ గా సూపర్ ఫాంలో ఉన్నప్పుడు తన తమ్ముడు సాయిరాం శంకర్ ను హీరోగా నిలబెట్టాలని తెగ ట్రై చేశాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సాయిరాం శంకర్ కు కమర్షియల్ బ్రేక్ అన్నది రాలేదు. తాజాగా తన కొడుకు ఆకాష్ పూరిని హీరోగా నిలబెట్టేందుకు పూరి తన సొంత ప్రొడక్షన్ లో మెహబూబా సినిమా తీశాడు. ఇండియా అబ్బాయి - పాక్ అమ్మాయి ప్రేమ కథగా తీసిన ఈ సినిమా వల్ల పూరి జేబు ఖాళీ అయింది తప్ప ఫలితం లేకపోయింది.

లాసొచ్చిందని వెనక్కి తగ్గడం పూరి స్టయిల్ కాదు కదా.. అందుకే తాజాగా తన కొడుకు ఆకాష్ పూరి హీరోగా మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ గా యూఎస్ లో ఓ భారీ చిత్రం తీయడానికి రెడీ అవుతున్నాడు. పనిలో పనిగా తమ్ముడు సాయిరాం శంకర్ కోసం కూడా ఓ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. తొందరలోనే ఆపని కూడా పూర్తి చేసి అతడితోనూ ఓ సినిమా తీస్తాడట. ఈసారైనా పూరి బౌన్స్ బ్యాక్ అవుతాడా?


Tags:    

Similar News