పూరీ కోసం వెయిట్ చేస్తున్న కామెడీ హీరో

Update: 2017-10-04 11:58 GMT
పైసా వసూళ్ తరువాత తన తనయుడిని ఆకాశ్ పూరీని ట్రాక్ ఎక్కించేందుకు నడుం బిగించాడు డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఈ ప్రాజెక్ట్ కి మెహబూబా అనే క్రేజీ టైటిల్ కూడా పెట్టేశాడు పూరీ. కొత్తమ్మాయి నేహా శెట్టిని తెలుగులోకి లాంఛ్ చేస్తూ శరవేగంగా ఈ చిత్రాన్ని పూర్తి చేసేందుకు పూరీ ప్లాన్ చేస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం కోసం ఆకాష్ కి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నాడట పూరీ, అంతేకాదు లుక్స్ పరంగా కూడా తనయుడిని కొత్తగా చూపించేందుక పూరీ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిసింది. ఇక ఈ సినిమా తరువాత బాలకృష్ణ సినిమాను సెట్స్ పైకి తీసుకురావడానికి ప్లాన్ చేసుకుంటున్నాడట పూరీ.

బాలయ్య 103వ సినిమాగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ ను ఓ వినూత్నమైన కాన్సెప్ట్ తో రూపొందించేందుకు పూరీ ప్లాన్ చేసినట్లుగా తెలిసింది. అంతేకాదు పూరీ సొంత బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇక ఈ చిత్రంతో పాటే సునీల్ హీరోగా పూరీ ఓ మూవీ ప్లాన్ చేస్తున్నాడు. ఇది కూడా పూరీ కనెక్ట్స్ బ్యానర్ లో ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సునీల్ లో ఉన్న కామెడీ టైమింగ్ కి తగ్గట్లుగా పూరీ ఓ స్టోరీ రెడీ చేసినట్లుగా చెబుతున్నారు. మరి ఈ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో పూరీ ఎలాంటి మెరుపులు మెరిస్తాడో చూడాలి.
Tags:    

Similar News