డ్రగ్స్ వ్యవహారంతో చాలామంది సెలబ్రిటీలపై మరకలు పడ్డాయి. అందులో స్టార్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ ఒకరు. అధికారులు ఎవరి పేర్లు బయటపెట్టకపోయినప్పటికీ వాళ్ల లిస్టులో ఉన్నచాలామంది సెలబ్రిటీల పేర్లు లీకైపోయాయి. దాంతో మీడియాలో వాళ్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎవరెవరిపై మరకలు పడ్డాయో వాళ్లల్లో చాలా మంది మీడియా ముందుకొచ్చి తమ అభిప్రాయాల్ని బయటపెట్టారు. అయితే కీలకమైన సెలబ్రిటీలు మాత్రం ఎవ్వరూ మీడియాకి అందుబాటులోకి రాలేదు.
పూరి అభిప్రాయం కోసం మీడియా తెగ ప్రయత్నాలు చేస్తోంది. నిన్న కొద్దిమంది మీడియా ప్రతినిధులతో ఆయన ఫోన్లో మాట్లాడాడట. త్వరలోనే ఆయన మీడియా ముందుకొస్తానని స్పష్టం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మరి పూరి డ్రగ్స్ విషయంలో తనపై పడ్డ మరకని తొలగించుకొనేందుకే మీడియా ముందుకొస్తారా లేదంటే, ఇతరత్రా వ్యాఖ్యలేమైనా చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పరిస్థితి చూస్తుంటే ఇప్పుడప్పుడే డ్రగ్స్ వ్యవహారం చల్లారేలా లేదు. పోలీసులు దగ్గర మరోకొత్త లిస్టు ఉందని, అది కూడా బయటికి రాబోతోందనే ప్రచారం జరుగుతోంది. అదేగనక జరిగితే డ్రగ్స్ కలకలం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.