జనగణమన పాడగలవా పూరి

Update: 2018-05-06 07:47 GMT
మే 11 విడుదల కానున్న మెహబూబా సినిమాతో దర్శకుడు పూరి జగన్నాధ్ డూ ఆర్ డై సిచువేషన్ ఫేస్ చేస్తున్నాడు. ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన టైంలో అసలు అనుభవమే లేని తన కొడుకు పూరి ఆకాష్ ని హీరో గా పెట్టి ఇంత బడ్జెట్ తో సినిమా తీస్తున్నాడు అన్నప్పుడే అభిమానులకు దీని మీద గట్టి నమ్మకం ఏర్పడింది. ఒకప్పుడు అగ్ర హీరోలు తన ఫోన్ కోసం ఎదురు చూసే రేంజ్ నుంచి తాను సినిమా చేస్తాను అంటే తప్పుకునే దాకా రావడంతో పూరి బాగా కసి మీదున్నాడు. పదే పదే చూపిస్తున్న బ్యాంకాక్ మాఫియా ఫార్ములా తనకే వెగటు పుట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర బౌన్సు బ్యాక్ అవుతుండటంతో ఈసారి మాత్రం ఇండో పాక్ నేపధ్యంలో సెన్సిటివ్ లవ్ స్టొరీ ఎంచుకున్నాడు పూరి. ఒక ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇది పునర్జన్మలను ఆధారంగా చేసుకున్న కథ అని చెప్పి చిన్న ట్విస్ట్ ఇచ్చాడు.

ఇక ఇది హిట్ అయితే పూరి మళ్ళి ఫాంలోకి వచ్చినట్టే అనుకోవాలి. కాని ఒక నాలుగేళ్ళు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే పూరి మహేష్ బాబు తో జనగణమన తీస్తానని అప్పట్లో ప్రకటించాడు. పోకిరి బిజినెస్ మెన్ వరస సక్సెస్ ఇచ్చాడు కాబట్టి మహేష్ కూడా ఆ టైం లో ఉత్సాహంగా ఉన్నాడు. కాని టైం సెట్ కాలేదో లేక ఇంకేదైనా కారణమో అది మళ్ళి కార్యరూపం దాల్చలేదు. నిజమైన ఇండియా ఎలా ఉండాలో అందులో చూపిస్తాను అని పలు సందర్భాల్లో చెప్పిన పూరి దాన్ని ఏ హీరోతో చేస్తాడో మాత్రం చెప్పలేదు. మహేష్ అయితే ఇప్పట్లో కష్టమే. మెహబూబా కనక హిట్ అయితే స్టార్ హీరోలను అప్రోచ్ కావడం పెద్ద కష్టమేమి కాదు. సామజిక స్పృహ ఉన్న ఇలాంటి కథలు వస్తే నిజంగానే బాగుంటుంది. కృష్ణవంశి కూడా గతంలో చిరంజీవితో వందేమాతరం తీయాలని చెప్పి ఆఖరికి మానేసాడు. ఇప్పుడు పూరి జనగణమనకు ఇప్పటికైనా మోక్షం వస్తే మంచిది.



Tags:    

Similar News