ఆకాష్ మూడేళ్ల‌కి యాక్ష‌న్ స్టార్‌

Update: 2016-01-11 03:46 GMT
టాలీవుడ్ స్పీడ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ బాల‌న‌టుడిగా స‌క్సెస్ ఫుల్ కెరీర్‌ ని సాగించాడు. మ‌న టాప్ హీరోల చిన్న‌ప్ప‌టి క్యారెక్ట‌ర్ల‌లో న‌టించి పెర్ఫామెన్స్‌ లో చిచ్చ‌ర‌పిడుగు అన్న పేరు తెచ్చుకున్నాడు. ప్ర‌కాష్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ధోని మూవీలోనూ కీల‌క‌పాత్రలో న‌టించి ఆక‌ట్టుకున్నాడు. అందుకే అత‌డిపై పూర్తి కాన్ఫిడెన్స్‌ తో ఆంధ్రా పోరి సినిమా తీశారు. ఈ మూవీలో ఆకాష్‌ లీడ్‌ రోల్‌ ఎటెంప్ట్ చేశాడు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన స్థాయి ఫ‌లితాన్ని ఇవ్వ‌లేదు.

దాంతో కాస్త ఆలోచ‌న‌లోకి వెళ్లిన పూరి .. ఆకాష్ కెరీర్ విష‌యంలో పూర్తిగా దృష్టి సారించాడు. ముందుగా బేసిక్ ఎడ్యుకేష‌న్‌ పై దృష్టి సారించ‌మ‌ని సల‌హా ఇచ్చాడు. ప్ర‌స్తుతం ఆకాష్ హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్ కోసం ప్రిప‌రేష‌న్‌ లో ఉన్నాడు. ప్ర‌పంచంలో విద్య‌ని మించిన‌ది ఏదీ లేదు. అది లేక‌పోతే ఇంకేదీ లేదు. అందుకే ఆకాష్‌ కి త‌క్ష‌ణ క‌ర్త‌వ్యాన్ని బోధించాడు పూరి. ఎలానూ మూడేళ్ల త‌ర్వాత స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో పూర్తి స్థాయి హీరోగా లాంచ్ చేయాల‌ని పూరి ప్లాన్ చేస్తున్నాడు. ఈలోగానే చ‌దువులు పూర్త‌యిపోతాయ్‌. ఆ త‌ర్వాత మాస్ యాక్ష‌న్ హీరోగా త‌న‌ని ఇంట్ర‌డ్యూస్ చేయాల‌నేది పూరీ ప్లాన్.

ఇదీ ఒకందుకు మంచిదే. డ్యూయ‌ల్ ప్లాన్ వ‌ల్ల ఫిల్మీ కెరీర్ లో చిక్కులు వ‌చ్చినా ఆల్ట‌ర్నేట్ ఆప్ష‌న్ అనేది ఉంటుంది. ఏదేమైనా ప్ర‌స్తుతం పూరి ప‌క్కాగా ఫ్యామిలీ మ్యాన్. ఛార్మితో ఇష్యూస్ అన్నీ క్లియ‌ర్‌. అందుకే ఇలా కుటుంబంపై పూర్తిగా దృష్టి సారించాడ‌ని అనుకోవ‌చ్చు. ఆకాష్‌ కి ఇదో స‌ద‌వ‌కాశం. త‌న‌ని తాను త‌ర‌చి చూసుకునే టైమ్ ఇది. అక‌డ‌మిక్ స్ట‌డీస్‌ ని పూర్తి చేసేప్ప‌టికి నూనూగు మీసాల నుంచి కోర‌మీసం మెలేసే లెవ‌ల్‌ కి ఎదిగేస్తాడు. గెడ్డం కూడా వ‌చ్చేస్తుంది. అప్పుడు మాసీగా క‌నిపిస్తాడు. మాస్ హీరోగా సూట‌వుతాడు. అదీ ప్లాన్‌.
Tags:    

Similar News