జీవితం లోతు కొలిచిన దర్శకుడు పూరి జగన్నాథ్. అందుకే ఆయన సినిమాల్లో జీవిత సత్యాలు బోలెడన్ని వినిపిస్తుంటాయి. ఒక చిన్న మాటతో అందరినీ ఆలోచనలో పడేయగల దిట్ట పూరి. ఆయన సినిమా షూటింగ్ కోసమని దేశదేశాలు చుట్టొస్తుంటారు. ఎక్కడికెళ్లినా అక్కడి సంస్కృతినీ, సంప్రదాయాల్ని నిశితంగా పరిశీలిస్తుంటాడు. దాన్ని మరో సినిమాలో ఎక్కడో ఒకచోట ఏదో రకంగా వాడేస్తుంటాడు. అప్పుడప్పుడు విలేకర్ల సమావేశంలోనూ ఆ దేశం ఇలా, ఇక్కడ అలా అంటూ ఆ విషయాల్ని ఆసక్తికరంగా చెబుతుంటారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే ఆయన ఇటీవల ట్విట్టర్ లో ఓ విషయాన్ని పోస్ట్ చేశాడు. స్పీక్ ఇంగ్లీష్, కిస్ ఫ్రెంచ్, డ్రైవ్ జర్మన్, డ్రెస్ ఇటాలియన్, స్పెండ్ అరబ్, పార్టీ కరీబియన్ అని రాసి ఉన్న కార్డ్ అది. దాన్ని చూడగానే నిజమే కదా అనిపించింది. పూరి ఆలోచనల నుంచి వచ్చిందో లేదంటే ఎక్కడైనా ఉన్నది పోస్ట్ చేశాడో తెలియదు కానీ... అది చూడగానే భలే ఉందే అనిపిస్తోంది. పూరి టేస్ట్ కి అద్దం పట్టేలా ఉంది ఆ పోస్టు.
ఇంగ్లీష్ లాంగ్వేజ్ అందమైనదని అంటుంటారు. నిజంగా అదొక యూనివర్సల్ లాంగ్వేజ్. అందుకే ఇంగ్లీష్ మాట్లాడమని చెబుతున్నాడు. ఇక ఫ్రెంచ్ కిస్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో అదే పనిగా చూపిస్తుంటారు. డ్రైవ్ జర్మన్ అంటే జర్మనీ రోడ్ల పై డ్రైవింగ్ సౌఖ్యంగా ఉండొచ్చు. అలాగే ఫ్యాషన్ కి పెట్టింది పేరు ఇటాలియన్. అందుకే ఇటాలియన్ లా డ్రెస్ చేసుకోమన్నాడు. అరబ్ కంట్రీస్ విలాసాలకి పెట్టింది పేరు. అక్కడ ఇళ్లు, హోటల్లు గడపడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయని చెబుతుంటారు. కరీబియన్ల పార్టీ గురించి క్రికెట్ చూసే వాళ్లకందరికీ తెలుసు. మ్యాచ్ గెలిచారంటే వెస్టిండీస్ ఆటగాళ్లు మైదానంలో ఎంతగా అల్లరి చేస్తుంటారో! గంగ్నమ్ డ్యాన్సులేసి మరీ అదరగొట్టేస్తుంటారు. మైదానంలోనే వాళ్లు అలా సందడి చేస్తారంటే ఇక హోటళ్లకు వెళితే చెప్పేదేముంటుంది? ఇలా ఎక్కడెక్కడ ఏది ప్రసిద్ధో తన పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చాడు పూరి. ఎంతైనా పూరి టేస్టే వేరు కదా!