లోఫర్‌ తరువాత రోగ్‌ అంటున్నాడు

Update: 2015-10-06 04:17 GMT
టైటిళ్ల  యందు పూరి జ‌గ‌న్నాథ్ టైటిళ్లు వేర‌యా విశ్వ‌ధాభిరామ వినుర సోమా! అని ప‌ద్యం పాడుకోవాల్సొస్తోంది. స్పీడ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌ టైటిళ్లు పెడితే ప‌క్కా మాసీగా ఉండాల్సిందే. నెగెటివ్ సెన్స్‌ లో వినిపించే ఆ టైటిళ్ల వ‌ల్ల‌నే మ‌న హీరోలు మాస్‌ లో బాస్ లు అయ్యే ఛాన్సుంద‌ని పూరి బ‌లంగా న‌మ్ముతాడు. అందుకే త‌న సినిమాల‌కు యార‌గెంట్ అనిపించే, నెగెటివ్ షేడ్ క‌నిపించే టైటిళ్ల‌నే ప్రిఫ‌ర్ చేస్తుంటాడు. ఇడియ‌ట్ - పోకిరి - దేశ‌ముదురు - లోఫ‌ర్‌ - రోగ్.. ఇలా ఉండాలి అత‌డి టైటిళ్లు. అలా లేక‌పోతే మాస్‌ కి ఎక్క‌దు అనేది అత‌డి ఫిలాస‌ఫీ.

పోకిరి అని పెట్టుకుంటే మీకు వ‌చ్చిన న‌ష్ట‌మేంటి? అని అడిగాడు అప్ప‌ట్లో. ఇప్పుడు లోఫ‌ర్‌ - రోగ్ అని పెట్టుకుంటా .. మీకేంట‌ట ప్రాబ్లెమ్‌? అని సూటిగా అడుగుతున్నాడు. నా హీరో నా ఇష్టం అని గురువు వ‌ర్మ బాణీలోనే వెళుతున్నాడు. అయితే మెగా హీరో వ‌రుణ్‌ తేజ్ విష‌యంలో మాత్రం పూరి ప‌ప్పులు ఉడ‌క‌డం లేదిప్పుడు. వ‌రుణ్‌ తేజ్‌ ని లోఫ‌ర్ అనే టైటిల్‌ తో సంభోధించ‌డం ఎవ‌రికీ న‌చ్చ‌లేదు. దాంతో ఇక ఎట్టి ప‌రిస్థితిలో ఆ టైటిల్‌ ని మార్చుకోవాల్సిన సీన్ వ‌చ్చేసింది. పూరి ఈ విష‌యంలో కాస్త అప్‌ సెట్‌ గా ఉన్నా న‌లుగురికీ న‌చ్చ‌ని టైటిల్ ఎందుకు పెట్టాలి? అని రాజీకి వ‌చ్చిన‌ట్టు ఇదివ‌ర‌కే చెప్పుకున్నాం. లోఫ‌ర్ టైటిల్ బ‌దులుగా మా అమ్మ మ‌హాల‌క్ష్మి అని టైటిల్ మార్చాడ‌ని నిన్న‌టిరోజున చెప్పుకున్నాం. మరి కొత్తగా రోగ్‌ అనే టైటిల్‌ ఎందుకు రిజిష్టర్‌ చేయించావ్‌ పూరి?

ఇదే విషయంపై పూరి గత రాత్రి ఫుల్‌ క్లారిటీ ఇచ్చేశాడులే. ఇషాన్ అనే కొత్త కుర్రాడిని టాలీవుడ్ కు పరిచయం చేయబోతున్న సంగతి వెల్లడించాడు. అదేనండి.. మహాత్మా సినిమా ప్రొడ్యూసర్‌ సి.ఆర్.మనోహర్ కొడుకుని ఇంట్రొడ్యూస్‌ చేస్తున్నాడని చెప్పాంగా.. ఆ పిల్లాడి కోసం ఈ టైటిల్‌ పెట్టాడట. నవంబర్‌ నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ అని సెలవిచ్చాడు. అది సంగతి.
Tags:    

Similar News