పూరి ఏం చెప్పినా అది ఎంతో ఉపయుక్తం అని ఇన్ స్టా అభిమానులంతా అంగీకరిస్తున్నారు. `పూరి మ్యూజింగ్స్` లో ఆణిముత్యాల్లాంటి విషయాల్ని ఆయన అభిమానుల కోసం చెబుతున్నారు. అనంతమైన నాలెజ్ ని పంచుతున్నారు. ఆయన చెప్పిన ఓ రెండు ఛమక్కులు విన్నాక మీరే ఆ మాట చెబుతారు. తొలిగా ఆయన నేషనల్ హెల్త్ స్కీమ్ (ఎన్.హెచ్.ఎస్) సహా ప్రజాభధ్రతకు విదేశాల్లో ప్రభుత్వాల జాగ్రత్తల గురించి చెప్పిన తీరు ఎంతో విజ్ఞానదాయకం.
మనమంతా పుట్టాక ఆనందంగా జీవించడానికి సంపాదిస్తాం. కానీ అది ఎంత సంపాదించాలో తెలీదు. ఆరోగ్యం పిల్లల చదువులు వృధ్యాప్యం అంటూ జాగ్రత్త పడతాం. కానీ విదేశాల్లో ఇవన్నీ ప్రభుత్వాలే చూసుకుంటున్నాయి.
యూరప్-కెనడా-ఆస్ట్రేలియా-యూకే లాంటి చోట్ల విద్య ఉద్యోగం ఆరోగ్యం అన్నీ ప్రభుత్వాలే చూస్తాయి. చాలా చోట్ల మినిమం విద్య ఫ్రీ. స్కాట్లాండ్ లో ఎంత చదివినా ఎడ్యుకేషన్ ఫ్రీ. నేషనల్ హెల్త్ స్కీమ్.. ఇది ప్రపంచంలోనే అద్భుతమైన వ్యవస్థ. ప్రతి వ్యక్తికి సంబంధించిన హెల్త్ రికార్డ్ ప్రైమరీ హెల్త్ వాళ్ల వద్ద ఉంటుంది. ఒకవేళ ఏదో ఊళ్లో ఉండి ఆస్పత్రికి వెళితే ప్రైమరీ హెల్త్ వాళ్లే రికార్డు మొత్తం వివరిస్తారు. లేదూ ఏ కాలో విరిగి ఆస్పత్రికి వెళితే ట్రీట్ మెంట్ మొత్తం ఫ్రీ. ఆస్పత్రిలో చేరితో ఆహారం ప్రతిదీ ఉచితం. 6 వారాల పాటు ట్రీట్మెంట్ సహా అన్నివసతులు ఉంటాయి. అలాగే ముసలాళ్లు అయిపోతే మూడుపూటలా తిండి పెడతారు. నీ ఆరోగ్యం గురించి చూస్తారు. ఎమర్జెన్సీ కి కాల్ చేస్తే హెలీకాఫ్టర్ లో వచ్చి మరీ ఆదుకుంటారు. ఆరోగ్యం వినోదం ప్రతిదీ చూస్తారు. షాపింగ్ కూడా చేసిపెడతారు.. ఇన్ని ఫీచర్స్ ఉంటాయి.
యూకే చూడటానికి వచ్చిన ఎవరికైనా ఎమర్జెన్సీ ఏదైనా ఫ్రీ. ఒక సిటిజన్ హెల్త్ కేర్ కోసం ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేస్తుంది. ఈ దేశాల్లో ఉంటే సొంత ఇల్లు ఉన్నా లేకపోయినా అక్కడ సిటిజన్ షిప్ తో చాలా ఉచితంగా ఉంటాయి. జీవితాంతం మనశ్శాంతి దక్కుతుంది.. అని తెలిపారు.
అలాగే ఆడా మగా ఏలియన్ ప్రేమ గురించి పూరి చెప్పిన విషయం వాస్తవికతను ప్రతిబింబించింది. ``ఒక బుక్ ఉంది.. మెన్ ఆర్ ఫ్రం మార్స్.. విమెన్ ఆర్ ఫ్రం వీనస్ ..అది నిజం.. ఆడాళ్లు మగాళ్లు ఒక జాతి కాదు. రెండు గ్రహాలకు చెందిన వాళ్లు.. వాళ్లకు మనం మనకు వాళ్లు ఏలియన్స్. మనం ఏలియన్స్ తోనే ప్రేమలో పడ్డాం. మగాళ్లు ఆడాళ్లకు రాత్రి పూట ఒక గంట సేపు కలుస్తాయి తప్ప ఇక కలవవు. అస్సలు సంబంధం ఉండదు. ఇంట్లో ఏదైనా సమస్య వస్తే మగాడు తనలో తానే కుమిలిపోతాడు. కానీ ఆడాళ్లు అలా కాదు. ఎంత అడిగినా అతడు క్లియర్ గా చెప్పడు. ఆవిడకు కాలుద్ది.. గొడవలవుతాయి`` అని తెలిపారు.Full View
మనమంతా పుట్టాక ఆనందంగా జీవించడానికి సంపాదిస్తాం. కానీ అది ఎంత సంపాదించాలో తెలీదు. ఆరోగ్యం పిల్లల చదువులు వృధ్యాప్యం అంటూ జాగ్రత్త పడతాం. కానీ విదేశాల్లో ఇవన్నీ ప్రభుత్వాలే చూసుకుంటున్నాయి.
యూరప్-కెనడా-ఆస్ట్రేలియా-యూకే లాంటి చోట్ల విద్య ఉద్యోగం ఆరోగ్యం అన్నీ ప్రభుత్వాలే చూస్తాయి. చాలా చోట్ల మినిమం విద్య ఫ్రీ. స్కాట్లాండ్ లో ఎంత చదివినా ఎడ్యుకేషన్ ఫ్రీ. నేషనల్ హెల్త్ స్కీమ్.. ఇది ప్రపంచంలోనే అద్భుతమైన వ్యవస్థ. ప్రతి వ్యక్తికి సంబంధించిన హెల్త్ రికార్డ్ ప్రైమరీ హెల్త్ వాళ్ల వద్ద ఉంటుంది. ఒకవేళ ఏదో ఊళ్లో ఉండి ఆస్పత్రికి వెళితే ప్రైమరీ హెల్త్ వాళ్లే రికార్డు మొత్తం వివరిస్తారు. లేదూ ఏ కాలో విరిగి ఆస్పత్రికి వెళితే ట్రీట్ మెంట్ మొత్తం ఫ్రీ. ఆస్పత్రిలో చేరితో ఆహారం ప్రతిదీ ఉచితం. 6 వారాల పాటు ట్రీట్మెంట్ సహా అన్నివసతులు ఉంటాయి. అలాగే ముసలాళ్లు అయిపోతే మూడుపూటలా తిండి పెడతారు. నీ ఆరోగ్యం గురించి చూస్తారు. ఎమర్జెన్సీ కి కాల్ చేస్తే హెలీకాఫ్టర్ లో వచ్చి మరీ ఆదుకుంటారు. ఆరోగ్యం వినోదం ప్రతిదీ చూస్తారు. షాపింగ్ కూడా చేసిపెడతారు.. ఇన్ని ఫీచర్స్ ఉంటాయి.
యూకే చూడటానికి వచ్చిన ఎవరికైనా ఎమర్జెన్సీ ఏదైనా ఫ్రీ. ఒక సిటిజన్ హెల్త్ కేర్ కోసం ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేస్తుంది. ఈ దేశాల్లో ఉంటే సొంత ఇల్లు ఉన్నా లేకపోయినా అక్కడ సిటిజన్ షిప్ తో చాలా ఉచితంగా ఉంటాయి. జీవితాంతం మనశ్శాంతి దక్కుతుంది.. అని తెలిపారు.
అలాగే ఆడా మగా ఏలియన్ ప్రేమ గురించి పూరి చెప్పిన విషయం వాస్తవికతను ప్రతిబింబించింది. ``ఒక బుక్ ఉంది.. మెన్ ఆర్ ఫ్రం మార్స్.. విమెన్ ఆర్ ఫ్రం వీనస్ ..అది నిజం.. ఆడాళ్లు మగాళ్లు ఒక జాతి కాదు. రెండు గ్రహాలకు చెందిన వాళ్లు.. వాళ్లకు మనం మనకు వాళ్లు ఏలియన్స్. మనం ఏలియన్స్ తోనే ప్రేమలో పడ్డాం. మగాళ్లు ఆడాళ్లకు రాత్రి పూట ఒక గంట సేపు కలుస్తాయి తప్ప ఇక కలవవు. అస్సలు సంబంధం ఉండదు. ఇంట్లో ఏదైనా సమస్య వస్తే మగాడు తనలో తానే కుమిలిపోతాడు. కానీ ఆడాళ్లు అలా కాదు. ఎంత అడిగినా అతడు క్లియర్ గా చెప్పడు. ఆవిడకు కాలుద్ది.. గొడవలవుతాయి`` అని తెలిపారు.