సినీ ప్రేక్షకులకు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పూరీ రియల్ లైఫ్ లో ఎలాంటి ఆటిట్యూడ్ చూపిస్తుంటాడో అదే తన సినిమాల్లో హీరోకి క్రియేట్ చేస్తుంటాడు. ఇక తనకి నచ్చని వ్యక్తుల గురించి నచ్చని విషయాల గురించి నిర్మొహమాటంగా మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని మొహం మీదే చెప్తూ ఉంటాడు. అది తన గురువు రామ్ గోపాల్ వర్మ అయినా తాను డైరెక్ట్ చేసిన స్టార్ హీరో అయినా సరే. పూరీ మనం జీవిస్తున్న సమాజం గురించి.. అందులోని వ్యక్తుల స్వభావాలను తెరపై చూపిస్తుంటారు పూరీ. ఇక ఆయన మాటలు.. సినిమాలో ఆయన చెప్పించే డైలాగ్స్ వింటే.. అరె పూరీ చెప్పేది నిజమే కదా అని ప్రతి ఒక్కడికి అనిపిస్తుంది. అందుకే అందరూ పూరీ చెప్పే జీవిత సత్యాలను ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోలకు ఉండే ఇమేజ్ ఈ డాషింగ్ డైరెక్టర్ క్రియేట్ చేసుకున్నాడు.
ఇదిలా ఉండగా పూరీ జగన్నాథ్ తన ఐడియాలజీని తనను అనుసరించేవాళ్లతో పంచుకోడానికి పోడ్ కాస్ట్ లో అకౌంట్ ఓపెన్ చేసారు. అందులో 'పూరీ మ్యూజింగ్స్' పేరుతో తన అనుభవాలు భావాలు ఆలోచనలు షేర్ చేసుకుంటున్నారు. ఆడియోల రూపంలో ఐడియాలజీని పంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు. పూరీ ఐడియాస్ అన్నీ మనీ - సింప్లిసిటీ - ఫారెస్ట్ - స్ట్రగులింగ్ డేస్ - సేల్స్ బాయ్ - ధేడ్ దిమాక్ - బుద్ధ - రైల్వే స్టేషన్ - మదర్ - హ్యూమానిటీ - సోషల్ మీడియా - మ్యారేజ్ ఇలా ఎపిసోడ్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ పోడ్ కాస్ట్ - ఆపిల్ పోడ్ కాస్ట్ - స్ఫోటిఫై లలో అందుబాటులో ఉన్న ఈ ఆడియోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.