కరోనా దెబ్బకు దేశం వదిలిపోవాలనుకునేవాళ్లు కొందరైతే రెసిడెంట్ ఈవిల్ హాంటెడ్ హౌస్ లాంటి నగరాల్ని వదిలి పల్లెలకు వెళ్లిపోవాలనుకునేవారు మరికొందరు. అలా పల్లెలకు చిన్న నగరాలకు వచ్చిన వారితో కరోనా అన్నిచోట్లకు విస్తరించింది. ఏదేమైనా ఇప్పుడు కరోనా లేని దేశాలకు కానీ.. లేదా ఏవైనా ఒంటరి దీవులకు కానీ పారిపోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే వేరే దేశాలకు పారిపోవడం అంత వీజీనా వీసాలు పాస్ పోర్ట్ లు లేనిదే పనవ్వదు.
అయితే ద్వంద్వ పౌరసత్వాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన దేశాలపై పూరి ఇచ్చిన క్లారిటీ చాలా బావుంది. ఒక మనిషి రెండు దేశాల్లో పౌరసత్వాన్ని పొందవచ్చు. ఈ విషయాన్ని తాజాగా పూరీ జగన్నాథ్ వివరించారు. ఇంతకీ ద్వంద్వపౌరసత్వానికి ఏఏ దేశాలు అనుమతిస్తాయి? వాటిని పొందాలంటే ఎంత చెల్లించాలి? అనేవి పూరి తాజా మ్యూజింగ్స్ లో వెల్లడించారు.
కరోనా కల్లోలంతో చాలా దేశాలు ద్వంద్వ పౌరసత్వాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ఇక్కడా అక్కడా నచ్చిన చోట ఎక్కడైనా ఉండొచ్చు. కరేబియన్ ద్వీపంలోని డొమినికా రియల్ ఎస్టేట్ లో రూ.కోటి పెడితే.. మీకు మీ కుటుంబంలో ఉన్న వాళ్లందరికీ అక్కడ పౌరసత్వం లభిస్తుంది. డొమినికా పాస్ పోర్ట్ ఉంటే 130 దేశాలకు ఎలాంటి వీసా తో పని లేకుండా వెళ్లొచ్చు. మాల్డొవా(తూర్పు యూరప్) దేశంలో రూ.90 లక్షలు పెట్టుబడి పెట్టినా లేదా బ్యాంక్ డిపాజిట్ చేసినా సరే మూడు నెలల్లో 120 దేశాలకు ఫ్రీ వీసా ఇచ్చేస్తారు. టర్కీ ముస్లిం దేశమైనా ముస్లింలు కానీ వారికి కూడా రెండో పాస్ పోర్ట్ ఇస్తారు. కాకపోతే రూ.2 కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఈ టర్కీ పాస్ పోర్ట్ ఉంటే 112 దేశాలకు వెళ్లి వచ్చేయొచ్చు. అన్నిచోట్లా ద్వంద్వ పౌరసత్వాలు ఇచ్చినా ఒక్క ఇండియాలో మాత్రం ఇలాంటిది కుదరదు.. అదే ట్విస్ట్.. అని పూరి తెలిపారు.
Full View