మొన్న పెళ్లి ప్రకటన.. నేడు ప్రెగ్నెన్సీ ప్రకటన

Update: 2022-12-31 08:30 GMT
తెలుగు లో సీమ టపాకాయ్‌.. అవును సినిమాలతో మంచి గుర్తింపు దక్కించుకుని ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన పూర్ణ బుల్లి తెర పై కూడా సందడి చేసి తెలుగు వారిని ఆకట్టుకున్న విషయం తెల్సిందే. వెండి తెర మరియు బుల్లితెరపై తనదైన ముద్ర వేసిన పూర్ణ ఇటీవలే పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే.

జూన్‌ 12న ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న పూర్ణ కాస్త ఆలస్యంగా తన పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. పెళ్లి అయిన చాలా నెలల తర్వాత ఫొటోలను షేర్‌ చేసి ఆ విషయాన్ని వెళ్లడించిన పూర్ణ తాజాగా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని మాత్రం వెంటనే తెలియజేసింది.

దుబాయ్‌ కి చెందిన వ్యాపారవేత్త ఆసీఫ్‌ అలీని పెళ్లి చేసుకున్న పూర్ణ ఇటీవలే తన వెడ్డింగ్ ఫొటోలను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

గత కొన్ని రోజులుగా ఈమె ఢీ షో లో కనిపించక పోవడంతో ఈమె బుల్లి తెరపై మరియు వెండి తెరపై కనిపించదేమో అని భావిస్తున్నారు.

ఈ సమయంలో పూర్ణ తాను తల్లి కాబోతున్నట్లు గా పేర్కొంది. పూర్ణ దంపతులు సోషల్‌ మీడియా ద్వారా తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లుగా తెలియజేశారు.

దాంతో అభిమానులు మరియు సన్నిహితులు సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మా తరపున కూడా పూర్ణ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News