నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది అంటాడు పవన్ కళ్యాణ్. ఐతే నా తిక్కకు లెక్కే లేదు అని రుజువు చేస్తోంది హాట్ హీరోయిన్ రెజీనా కసాండ్రా. 103 అంతస్థులున్న స్కై స్క్రాపర్ పైకి ఎక్కితే ఎవరికైనా ఏమనిపిస్తుంది..? ఒళ్లు గగుర్పొడుస్తుంది. భయపడతారు. ధైర్యం ఉన్నవాళ్లయితే తమాయించుకుని అక్కడి నుంచి ఏరియల్ వ్యూ చూసి ఆస్వాదిస్తారు. ఐతే రెజీనా మాత్రం అంత ఎత్తులో ఓ మూలకు వెళ్లి పుష్ అప్స్ తీసి అందరికీ షాకిచ్చింది. రెజీనాకు మరీ ఈ స్థాయిలో తిక్క ఉందని జనాలకు ఇప్పుడే తెలుస్తోంది.
ఎప్పుడెళ్లిందో ఏమో కానీ.. షికాగోలోని 103 అంతస్థుల భవనం 'స్కైడెక్ షికాగో'ను సందర్శించిన రెజీనా.. చివరి ఫ్లోర్ కు చేరుకుని ఈ సాహసం చేసింది. పుష్ అప్స్ తీస్తూ.. అద్దంలోంచి కింద చీమల్లా కనిపిస్తున్న మనుషుల్ని, వాహనాల్ని చూస్తూ ఫొటో తీయించుకుంది రెజీనా. ఈఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి చూస్కోండి నా తిక్క అంటూ తనలోని మరో యాంగిల్ చూపించింది రెజీనా. అంతేకాదు ‘స్కైడెక్ షికాగోకు వెళ్లి ఏరియల్ వ్యూతో సరిపెట్టుకోకుండా తనలాగే ఫుష్ అప్స్ తీయమని.. ఫొటో తీసుకోవడం మర్చిపోవద్దని కూడా సలహా ఇచ్చింది రెజీనా.