ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ `పుష్ప : ది రైజ్`. సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఊహించినట్టుగానే ఈ చిత్రానికి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ లభించాయి.
తొలి సారి బన్నీ నటించిన పాన్ ఇండియా స్థాయి మూవీ కావడంతో ఈ చిత్రానికి హైప్ కూడా అదే స్థాయిలో క్రియేట్ అయింది. దీనికి తోడు సినిమా రిలీజ్ కి ముందు జరిగిన వివాదాలు కూడా ఈ సినిమా కి మరింత హైప్ ని తీసుకొచ్చాయి.
సమంత ఐటమ్ సాంగ్ పై జరిగిన రచ్చ ఓ రేంజ్ లో `పుష్ప`కు మరింత ప్రచారాన్ని తెచ్చిపెట్టింది. అంతే కాకుండా కర్ణాటకలో కన్నడ వెర్షన్ కి మించి తెలుగు వెర్షన్ కి అత్యధిక థియేటర్లని కేటాయించడం కూడా వివాదంగా మారడం.
అక్కడి అభిమానులు #BoycottPushpaInKannada అంటూ నెట్టింట వివాదాన్ని సృష్టించడం కూడా `పుప్పు`కు బాగానే కలిసి వచ్చి పాన్ ఇండియా రేంజ్ లో హైప్ క్రియేట్ అయ్యింది. అయితే సినిమా ఆ రేంజ్ హైప్ కి తగ్గట్టుగా అభిమానుల్ని సంతృప్తి పరచలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రెండు బాగాల్లో ఈ సినిమా వుంటుందని మేకర్స్ చెప్పి మరీ పార్ట్ 1ని `పుష్ప : ది రైజ్` పేరుతో విడుదల చేయడంతో పార్ట్ 2 కూడా వుంటుందని చెప్పడంతో ఈ సినిమాని ఆడియన్స్ ఓరేంజ్‌లో ఊహించేసుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఓవర్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ సినిమా మాత్రం హైప్ కి తగ్గ రేంజ్ లో లేకపోయేసరికి మిక్స్డ్ టాక్ నుంచి యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంటోంది.
ఓవరాల్ గా చూస్తే సినిమా బాగానే వుంది. కానీ యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుందంటే మేకర్స్ ఎలా ఎలా మేనేజ్ చేశారన్నది ఇక్కడ అర్థం కాని విషయం.
అంతే కాకుండా ఈ సినిమా పై మొదటి నుంచి భారీ అంచనాలని పెట్టుకోవడమే కాకుండా గట్టి నమ్మకంతో వున్నాడు బన్నీ. అంతే కాకుండా ఈ సినిమా తను అనుకున్న స్థాయిలో చర్చనీయాంశంగా నిలవకపోయినా.. దర్శకుడు సుకుమార్ ప్రతిభ గురించి ఎవరూ చర్చించకపోయినా తాను మైత్రీ ఆఫీస్ లో షర్ట్ విప్పి తిరిగేస్తానని ఓపెన్ ఛాలెంజ్ చేశారు కూడా.
బన్నీ ఇలా మాట్లాటానికి ప్రధాన కారణం ఈ సినిమా అతని స్టార్ డమ్ కు అగ్ని పరీక్షగా తాను భావించడమేనని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
తొలి సారి పాన్ ఇండియా స్థాయిలో చేసిన సినిమా కావడం, ఐదు భాషల్లో సినిమాని విడుదల చేయడం వంటి కారణాలతో సినిమా ఒక విధంగా చెప్పాలంటే బన్నీ స్టార్ డమ్ కు అగ్ని పరీక్షే అంటున్నారు. గత చిత్రం `అల వైకుంఠపురములో` త్రివిక్రమ్ మాటల గారడీ.. తమన్ మ్యాజిక్ కారణంగానే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందన్నది జగమెరిగిన సత్యం.
అంతే కాకుండా `అల వైకుంఠపురములో` కు ముందు చేసిన `దువ్వాడ జగన్నాథమ్` ఫరవాలేదనిపించినా .. `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` బన్నీ కెరీర్ లోనే డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఒక్కసారిగా బన్నీ ఆలోచనలో పడాల్సి వచ్చింది. రెండేళ్ల విరామం తరువాత `అల వైకుంఠపురములో` చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకున్నా బన్నీకి `పుష్ప` నిజంగా లిట్మస్ టెస్టే అని అంటున్నారంతా.
మరి బన్నీస్టార్‌డమ్ కు అగ్ని పరీక్షగా మారిన `పుష్ప` గట్టెక్కించి తన సత్తాని పాన్ ఇండియా రేంజ్ లో చాటుతుందా అన్నది తెలియాలంటే ఈ వారాంతం వరకు వేచి చూడాల్సిందే.