ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు.. అలాగే ఒక్క సినిమా కూడా హీరో స్టార్ డమ్ ని, మార్కెట్ ని, అతని ఐడియాలజీని కూడా మార్చేస్తోందని తాజాగా 'పుష్ప ది రైజ్' మూవీ నిరూపించింది. ఐకాన్ స్టార్ బన్నీ కాస్తా ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఊహించని స్టార్ డమ్ ని సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ ని దాటి దేశ వ్యాప్తంగా క్రేజ్‌ని దక్కించుకున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ మూవీతో స్టార్ డైరెక్టర్ సుకుమార్ రేంజ్ కూడా పెరిగిపోయింది. ఆయన కూడా పాన్ ఇండియా డైరెక్టర్ ల జాబితాలో చేరిపోయారు. దక్షిణాదిని మించి ఉత్తరాదిలో ఈ మూవీ వసూళ్ల వర్షం కురిపించింది. ఏకంగా ఉత్తరాదిలో ఈ మూవీ రూ. 100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టడంతో బాలీవుడ్ దిగ్గజాల్లో కొత్త చర్చకు దారితీసింది. ఎలాంటి ప్రచారం లేకుండా ఓ సౌత్ సినిమా 100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టడం ఏంటని అంతా అవాక్కయ్యారు. ఇప్పటికీ ఈ రిజల్ట్ ని జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే ఈ ఫలితాన్ని హీరో అల్లు అర్జున్ అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారట. 'పుష్ప' పార్ట్ 1 ఊహించని స్థాయిలో వసూళ్లని రాబట్టి పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో ముందు అనుకున్న పారితోషికాన్ని మార్చేసి మేకర్స్‌కి కొత్త లెక్కలు వినిపించారట.ఈ విషచంలో సుక్కు కూడా హీరో బన్నీనే ఫాలో అయ్యారట. దీంతో 'పుష్ప 2' పట్టాలెక్కడానికి ఆలస్యం అవుతూ వస్తోందని ఇండస్ట్రీ వర్గాల్లో విపిస్తోంది.
అంతే కాకుండా మారిన సమీకరణాల నేపథ్యంలో తన రెమ్యునరేషన్ బదులుగా ఈ హిందీ రైట్స్ ని బన్నీ అడుగుతున్నారట. ఆ కారణంగానే హిందీ వెర్షన్ కోసం మెగా ప్రొడ్యూసర్, అండ్ ఫాదర్ అల్లు అరవింద్ ని రంగంలోకి దింపారని వార్తలు వినిపిస్తున్నాయి. పార్ట్ 1 కోసం ఇప్పటికే బన్నీ 45 కోట్ల ప్యాకేజీని తీసుకున్నారని, ఇప్పడు పార్ట్ 2 హిందీ వెర్షన్ రైట్స్ ని డిమాండ్ చేస్తున్నారని చెబుతున్నారు. మేకర్స్ కూడా ఈ డీల్ కి రెడీ అయిపోయారట. అందుకే హిందీ వెర్షన్ బాధ్యతల్ని అల్లు అరవింద్ కి అప్పగించబోతున్నారట.
ఇదే ఇప్పడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదిలా వుంటే ఇప్పటికే స్క్రిప్ట్ లో తుది మార్పులు పూర్తి చేసిన సుకుమార్ పార్ట్ 2 షూటింగ్ కోసం లొకేషన్ లని ఫైనల్ చేసే పనిలో వున్నారట.
'పుష్ప'ని మారేడుమిల్లి ఫారెస్ట్ లో పూర్తి చేసిన సుకుమార్ 2 పార్ట్ ని మాత్రం కేరళ అడవులతో పాటు అరుణాచల్ ప్రదేశ్ అడవుల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందు కోసం అక్కడి అడవుల్లో ప్రత్యేకంగా సినిమాకు అనువుగా వుండే లొకేషన్ లని వెతుకుతున్నారట. ఏప్రిల్ లేదా మేలో పార్ట్ 2 ని పట్టాలెక్కించబోతున్నట్టుగా తెలుస్తోంది.