'పుష్ప' దూకుడు అక్కడ కూడా షూరూ ఐనట్టే!

Update: 2021-09-27 05:38 GMT
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపుదశకి చేరుకుంది. ఎర్రచందనం అక్రమరవాణా నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అడవి నేపథ్యంలో అనూహ్యమైన మలుపులతో ముందుకు సాగనుంది. ఇంతవరకూ తాను చేస్తూ వచ్చిన పాత్రలకు పూర్తి భిన్నమైన పాత్రను అల్లు అర్జున్ ఈ సినిమాలో పోషిస్తున్నాడు. ఆయన లుక్ ను డిఫరెంట్ గా డిజైన్ చేసిన తీరు, అందరిలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

మైత్రీ మూవీ మేకర్స్ - ముత్తంశెట్టి మీడియా వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు భాగాలు ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. మొదటి భాగాన్ని క్రిస్మస్ కానుగా డిసెంబర్ లో విడుదల చేయనున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా .. తెలుగుతో పాటు వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. అలా మహారాష్ట్రలోను ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. అక్టోబర్ 22వ తేదీ నుంచి మహారాష్ట్రలో థియేటర్లు ఓపెన్ కానున్నాయి. ప్రభుత్వం నుంచి అందుకు సంబంధించిన అనుమతులు కూడా వచ్చాయి. విడుదలకు ముస్తాబైన సినిమాలన్నీ అక్కడి థియేటర్లకు రావడానికి క్యూ కడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' కూడా డిసెంబర్లో థియేటయర్లకు రానుందనే టాక్ వచ్చింది. అదే జరిగితే అక్కడ 'పుష్ప' సినిమాకు గట్టి పోటీ ఎదురైనట్టేనని అంతా అనుకున్నారు. కానీ ఆ గండం కాస్తా గట్టెక్కేసింది .. 'లాల్ సింగ్ చద్దా' సినిమాను డిసెంబర్ లో థియేటర్లకు తీసుకురావాలనే ఆలోచనను వాయిదా వేసుకున్నారు. 'వాలెంటైన్స్ డే' సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అందువలన ఇక ఇప్పుడు అక్కడ 'పుష్ప'కు గట్టి పోటీ లేనట్టే అయింది. ఇక ఆ స్థాయిలో అక్కడ 'పుష్ప' దూకుడును అడ్డుకునే సినిమాలేవీ లేవు.

'లాల్ సింగ్ చద్దా' పై భారీ అంచనాలు ఉన్నాయి. ఒక వైపున దేశభక్తి .. మరో వైపున ప్రేమకథతో ఈ సినిమా సాగుతుంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, యాక్షన్ .. ఎమోషన్స్ ఒక రేంజ్ లో ఉండనున్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఆయన పాత్ర ద్వారానే ఎక్కువ ఎమోషన్ కనెక్ట్ అవుతుందని అంటున్నారు. తెలుగులోను ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇంతవరకూ ఆమిర్ ఖాతాలో నమోదైన సంచలనం విజయాల్లో ఈ సినిమా కూడా చేరుతుందేమో చూడాలి.




Tags:    

Similar News