సుకుమార్ సినిమాలకు ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంటుంది. అక్కడ ఇప్పటి వరకు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ప్రతి ఒక్క సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. వరుసగా ఓవర్సీస్ లో రికార్డు స్థాయి వసూళ్లను దక్కించుకున్న సుకుమార్ ప్రస్తతుం 'పుష్ప' సినిమా ను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. అల్లు అర్జున్ తో ఈయన తీస్తున్న సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండు పార్ట్ లుగా ఈ సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. మొదటి పార్ట్ చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ తాత్కాలికంగా నిలిపి వేయడం జరిగింది.
పుష్ప సినిమాకు ముందు రంగస్థలం సినిమాతో ఓవర్సీస్ లో భారీ వసూళ్లను నమోదు చేసిన సుకుమార్ పుష్ప సినిమా పై భారీ అంచనాలు కలిగేలా చేశాడు. దాంతో ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పెద్ద మొత్తంలో ఈ ఒప్పందం జరిగినట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఇది టాప్ గా చెబుతున్నారు. సుకుమార్ తో పాటు అల్లు అర్జున్ కు కూడా ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది. కనుక మైత్రి మూవీస్ వారికి ఓవర్సీస్ రైట్స్ ద్వారా పంట పండినట్లయ్యింది.
పుష్ప సినిమా లో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తుండగా కీలక పాత్రలో ఫాహాద్ ఫాజిల్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఇంకా బాలీవుడ్ స్టార్స్ పలువురు కూడా ఈ పాన్ ఇండియా మూవీలో కనిపించబోతున్నారు. హిందీ డబ్బింగ్ రైట్స్ కు కూడా మంచి క్రేజ్ ఉంది. కనుక ఓవర్సీస్ లో కూడా హిందీ డబ్బింగ్ వర్షన్ కు మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. కనుక ఓవర్సీస్ రైట్స్ ను రికార్డు రేటుకు బయ్యర్లు కొనుగోలు చేశారని తెలుస్తోంది.