ఈ రోజు నుంచి 'పుష్ప' దూకుడు మొదలవుతుందట!

Update: 2021-10-25 04:11 GMT
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను, పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 17వ తేదీని రిలీజ్ డేట్ గా ఖరారు చేశారు. ఆల్రెడీ అక్టోబర్ పూర్తయిపోయింది ..  ఇక మధ్యలో ఉన్నది నవంబర్ మాత్రమే. అందువలన ఈ సినిమా టీమ్ ఈ రోజు నుంచి ప్రమోషన్స్ పరంగా స్పీడ్ పెంచనున్నట్టు తెలుస్తోంది. అంటే ఇక నుంచి ఈ సినిమా నుంచి అప్ డేట్స్ పెద్దగా గ్యాప్ లేకుండా వెంటవెంటనే వదులుతూ ఉంటారన్న మాట.

ఈ సినిమా నుంచి బన్నీ లుక్ బయటికి వచ్చిన దగ్గర నుంచి అంచనాలకు అంకురార్పణ జరిగింది. ఆ తరువాత వదిలిన 'దాక్కో దాక్కో మేక'ను రికార్డులు రింగ్ టోన్ గా పెట్టుకున్నాయి. దాచేస్తే దాగునా ఇది అంటూ రష్మికను కాస్త హాట్ గా చూపిస్తూ వదిలిన లుక్ ను చూసిన కుర్రాళ్లంతా ఇలాంటి అడవిలో ఎంతకాలమైనా ఎంచక్కా  ఉండిపోవచ్చని అనుకున్నారు. ఇక శ్రీవల్లి పేరుతో వచ్చిన పాట .. అంచనాలకు హద్దులు చెరిపేస్తూ వెళ్లింది. అలా ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన అప్ డేట్లు లైకుల బరువును మోయలేకపోతున్నాయి.

ఈ నేపథ్యంలో మరింత ఊపుతో ప్రమోషన్స్ మొదలుపెట్టడానికి ఈ సినిమా టీమ్ సిద్ధమవుతోంది. ఈ రోజు నుంచి ఇక సినిమా విడుదలకు ముందురోజు వరకూ ఈ సినిమా జనం నోళ్లలో నానేలా .. వాళ్లంతా ఈ సినిమా గురించి మరిచిపోకుండా మాట్లాకునేలా ప్లాన్ చేశారట. అదే ఈ రోజు నుంచి అమలు కానుంది. ప్లానింగ్ లో సుకుమార్ కి వంకబెట్టవలసిన పనిలేదు. ఆయన సినిమాలకు సంబంధించిన కథాకథనాలు ఎంత పక్కాగా ఉంటాయో .. ఆయన ప్లానింగ్ కూడా అంతే పక్కాగా ఉంటుంది.

'నాన్నకు  ప్రేమతో'  సినిమాను ఫారిన్ నేపథ్యంలో తెరకెక్కించిన సుకుమార్, ఆ సినిమాతో ఎన్టీఆర్ కి భారీ హిట్ ఇచ్చాడు. ఇక 'రంగస్థలం' సినిమాను గ్రామీణ నేపథ్యంలో రూపొందించి, ఆ సినిమాను చరణ్ కెరియర్లోనే ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టాడు. ఇక ఇప్పుడు అడవి నేపథ్యంతో కూడిన కథను ఆసక్తికరంగా అందించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాకి బన్నీ కెరియర్లో ఎలాంటి స్థానం దక్కుతుందో చూడాలి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఆల్రెడీ మంచి మార్కులు కొట్టేసింది. ఇక యాక్షన్ అనేది ఈ సినిమాకి మరో ముఖ్యమైన పిల్లర్ గా నిలవనుందని అంటున్నారు.
Tags:    

Similar News