'పుష్ప‌' టీమ్ వెన‌క్కి త‌గ్గింది అందుకేనా?

Update: 2022-12-17 09:30 GMT
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ 'పుష్ప 2'. పాన్ ఇండియా మూవీగా ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టించిన 'పుష్ప‌' కు సీక్వెల్ గా చేస్తున్న సినిమా ఇది. ఫ‌స్ట్ పార్ట్ కు అనూమ్య ఆద‌ర‌ణ ద‌క్క‌డంతో 'పుష్ప 2'ని హై రేంజ్ లో ఊహ‌కంద‌ని విధంగా తెర‌పైకి తీసుకురాబోతున్నారు. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌ మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమాను తెర‌పైకి తీసుకొస్తున్నారు.

గ‌త కొన్ని నెల‌లుగా ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట‌వుతుందా? అని యావ‌త్ దేశ వ్యాప్తంగా వున్న సినీ ప్రియులు ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఎట్ట‌కేల‌కు ఇటీవ‌లే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. ఇదిలా వుంటే ఈ మూవీ నుంచి ఫ‌స్ట్ గ్లింమ్స్ ని రిలీజ్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు సుకుమార్‌, హీరో అల్లు అర్జున్ ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే. ప్ర‌పంచం మొత్తం ఆస‌క్తిగా ఎదురు చూసిన 'అవ‌తార్ 2' తో 'పుష్ప 2' గ్లిమ్స్ ని విడుద‌ల చేయాల‌ని టీమ్ ప్లాన్ చేసుకుంది.

దీంతో 'అవ‌తార్ 2' థియేట‌ర్ల‌లో 'పుష్ప 2' గ్లిమ్స్ ని చూడొచ్చ‌ని.. ఎలాంటి కంటెంట్ తో ఈ సారి స‌ర్ ప్రైజ్ చేయ‌బోతున్నారో అని ప్రేక్ష‌కులు, అభిమానులు ఆశ‌గా ఎదురు చూశారు.. అయితే చివ‌రి నిమిషంలో 'పుష్ప‌' టీమ్ వెన‌క్కి త‌గ్గ‌డంతో ఉసూరుమ‌న్నారు. ఇంత‌కీ 'పుష్ప‌' టీమ్ గ్లిమ్స్ విష‌యంలో వెన‌క్కి త‌గ్గ‌డానికి గ‌ల కార‌ణం ఏంటీ? .. ఎందుకు విర‌మించుకున్నార‌ని ఆరా తీస్తే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది.

'పుష్ప‌' మూవీని రీసెంట్ గా ర‌ష్యాలో రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ ప్ర‌మోస‌న్స్ కోసం ర‌ష్యా లోని మాస్కోకు వెళ్లిన చిత్ర బృందం తిరిగి ఇండియా వ‌చ్చేశారు. దీని కార‌ణంగానే 'పుష్ప 2' గ్లిమ్స్ ని అనుకున్న టైమ్ కి రెడీ చేయ‌లేక‌పోయార‌ట‌. ముందుగా ర‌ష్యా వెళ్ల‌డానికి ముందు గ్లిమ్స్ కోసం ఫొటో షూట్ ని షూట్ చేసిన చిత్ర బృందం ఫైన‌ల్ క‌ట్ విష‌యంలో ఆల‌స్యం కావ‌డం.. అదే స‌మ‌యానికి పుష్ప 2 డైలాగ్ అంటూ ఓ డైలాగ్ బ‌య‌టికి రావ‌డంతో డైల‌మాలో ప‌డ్డార‌ట‌.

రీసెంట్ గా 'పుష్ప 2' డైలాగ్ అంటూ ' అడ‌విలో జంతువులు నాలుగు అడుగులు వెన‌క్కి వేసాయి అంటే..? పులి వ‌చ్చింద‌ని అర్థం. అదే పులి నాలుగు అడుగులు వెన‌క్కి వేసిందంటే పుష్ప‌రాజ్ వ‌చ్చాడ‌ని అర్థం' అంటూ ఓ డైలాగ్ రీసెంట్ గా నెట్టింట వైర‌ల్ గా మారి హ‌ల్ చ‌ల్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ డైలాగ్ తో పాటు గ్లిమ్స్ అనుకున్న విధంగా రాక‌పోవ‌డంతో టీమ్ వెన‌క్కి త‌గ్గి కొత్త ఆలోచ‌న‌తో స‌రికొత్త గ్లిమ్స్ తో రావాల‌ని ప్లాన్ చేస్తున్న‌ట్టుగా తెలుస్తోది. ఈ నెలాఖ‌రున లేదా సంక్రాంతికి గ్లిమ్స్ తో స‌ర్ ప్రైజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News