స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం `పుష్ప` శరవేగంగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. మొదటి భాగం `పుష్ప ది రైజింగ్` టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే తొలి భాగం షూటింగ్ కూడా పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. డిసెంబర్ లో మొదటి భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే బాగా ఆలస్యమైన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది లోనే రిలీజ్ చేయాలని యూనిట్ శ్రమిస్తోంది. ఓ వైపు దానికి సంబంధించిన ప్రచారం పనులను ముమ్మరం చేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు..లిరికల్ సాంగ్స్ కి మంచి ఆదరణ దక్కింది.
దీంతో సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. మరోవైపు రెండవ భాగం చిత్రీకరణ కూడా సైలెంటు గా సాగింది. కానీ వేగవంతం కాలేదు. సుకుమార్ సహా టీమ్ మొదటి భాగానికి సంబంధించిన పనుల్లోనే నిమగ్నమయ్యారు. ఇప్పుడు ఈ ఆలస్యమే బన్నీకి సమస్యగా మారిందని గుసగుస వినిపిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో మార్చిలోపు పుష్ప పార్ట్ 2 షూటింగ్ సహా డబ్బింగ్ పూర్తిచేసి పూర్తిగా బయటకు వచ్చేయాలని చూస్తున్నాడు. అనంతరం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమాని లాంచ్ చేసి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లిపోవాలన్నది బన్నీ ప్లాన్ గా కనిపిస్తోంది. మరి` పుష్ప` విషయంలో బన్నీ ఇంత తొందరపడటానిక కారణాలు ఏంటి? అంటే ఆసక్తికర సంగతులే బయటకు వస్తున్నాయి.
హిందీ రైట్స్ విషయంలో నిర్మాతలకు-డిస్ట్రిబ్యూటర్ కి మధ్య సమస్య తలెత్తిన సంగతి తెలిసిందే. హిందీ డబ్బింగ్ రైట్స్ ఓ ప్రముఖ యూ ట్యూబ్ ఛానల్ కు విక్రయించారని సమాచారం. సౌత్ లో మాత్రమే థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు.. హిందీలో మాత్రం థియేటర్ రిలీజ్ కాకుండా రైట్స్ కట్టబెట్టారు. ఆ తర్వాత సన్నివేశం మారిపోయింది. పాన్ ఇండియా రిలీజ్ నేపథ్యంలో హిందీలోనూ థియేటర్లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సదరు యూట్యూబ్ ఛానల్ అధినేతలు థియేటర్ రిలీజ్ కి ఎలా వెళ్తారంటూ చట్టపరంగా చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించారట.
దీంతో `పుష్ప` హిందీ రిలీజ్ వ్యవహారం కూడా ఇప్పట్లో తేలేదిగా కనిపించడం లేదు. దానికి తోడు సినిమాకి అనుకున్న బడ్జెట్ కన్నా అదనంగా భారీగానే ఖర్చు అయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకా పార్ట్ -2 సన్నివేశాలు బ్యాలెన్స్ ఉన్నాయి. ఇలా పుష్ప విషయంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బన్నీ సైతం వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ ని పూర్తిచేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బన్ని ఆదిత్య శ్రీరామ్ తో ఐకాన్ చిత్రీకరణకు వెళ్లాల్సి ఉండగా సడెన్ గా బోయపాటి తెరపైకి రావడం ఆసక్తికరం. మరి ఆ ఇద్దరిలో ఎవరితో ముందు మొదలు పెడతారు? అన్నదానిపైనా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంటుంది.
హిందీ రైట్స్ తోనే తకరారు!
2021 మోస్ట్ అవైటెడ్ మూవీ #పుష్ప తెలుగు-తమిళం-మలయాళంతో పాటు పాన్ ఇండియా కేటగిరీలో వివిధ భాషల్లోకి అనువాదమై అత్యంత భారీగా విడుదల కానుంది. అన్ని భాషల్లోనూ పుష్ప బిజినెస్ జోరుగానే సాగుతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్ లకు పోస్టర్లకు చక్కని స్పందన వచ్చింది. అయితే తెలుగు-తమిళ మార్కెట్లలో ఓకే కానీ హిందీ మార్కెట్లోనే తాజా పంచాయితీ పుష్పరాజ్ కి షాకిస్తోందనేది గుసగుస.
బన్ని మార్కెట్ విషయం పక్కన పెడితే ఇప్పుడు పుష్ప హిందీ రైట్స్ కొనుకున్న వాళ్లు ఏకంగా ఈ సినిమాను హిందీలో థియేటర్ రిలీజ్ చేయడానికి వీల్లేదు అంటున్నారట. దీంతో ఖంగుతున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ పంచాయితీని తీర్చాల్సిందిగా అల్లు అరవింద్ ని, బన్నీని కోరినట్లుగా సమాచారం. పంపిణీదారుడితో గొడవను చల్లార్చే బాధ్యతను ఇప్పుడు ఆ ఇద్దరూ తీసుకున్నారట. చివరకు పుష్ప రాజ్ దగ్గరకే పుష్ప హిందీ రైట్స్ పంచాయితీ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పుష్ప కోసం ఇప్పటి వరకు మైత్రి సంస్థ దాదాపుగా 195 కోట్లు ఖర్చు చేసింది. సుకుమార్ - బన్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమాగా రికార్డులకెక్కనుంది. ఆర్య-ఆర్య 2 తర్వాత హ్యాట్రిక్ మూవీగా వస్తోంది కాబట్టి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్ని మాస్ యాక్షన్ అవతార్ కి చక్కని స్పందన వస్తోంది. క్రిస్మస్ కానుకగా ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదలవుతోంది. అయితే హిందీ రిలీజ్ ఎంతో కీలకం కానుంది కాబట్టి సమస్యను పరిష్కరించుకునే దిశగా బన్ని ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.