సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి హీరో నటించిన ఫ్యామిలీ మూవీ.. సమ్మర్ లో రిలీజ్ అయితే ప్రభంజనాలు సృష్టించాలి. పాయింట్స్ బాగున్నా, వాటిపై ఫోకస్ చేయకుండా.. ఏ మాత్రం ఆకట్టుకోలేని స్క్రీన్ ప్లేతో.. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన బ్రహ్మోత్సవం అందరినీ నిరాశపరిచింది. మొదటి రోజునే డిజాస్టర్ అనిపించుకున్న బ్రహ్మోత్సవం.. మూడో రోజుకో నష్టాల లెక్కలు వేయాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. పెట్టుబడిలో సగం కూడా రాబట్టగలిగే అవకాశం లేదని తేల్చేశారు ట్రేడ్ జనాలు.
నిర్మాణ సంస్థ పీవీపీ సినిమా.. ఈ వెంచర్ తో సేఫ్ అనాల్సిందే. అన్ని ఏరియాల్లోనూ రిలీజ్ కు ముందే అమ్మేశారు. దీంతో ప్రొడ్యూసర్ కి వచ్చిన నష్టమేం లేదు. మూవీని రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్లే ఈ నష్టమంతా భరించాల్సి వస్తుంది. బ్రహ్మోత్సవంకు చేసుకున్న అగ్రిమెంట్స్ అన్నీ నో ఆబ్లిగేషన్ బాపతే. అంటే నష్టం వచ్చినా నోర్మూసుకోవడమే తప్ప చేయగలిగింది ఏం లేదు. అయితే.. బడా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న పీవీపీ మాత్రం.. ఈ విషయంలో ఉదారంగా ఉండాలని నిర్ణయించడం విశేషం.
బ్రహ్మోత్సవంకు వచ్చే నష్టాల్లో 50శాతం తను తిరిగి చెల్లించేందుకు నిర్మాత సిద్ధమయ్యారని అంటున్నారు. ఈమేరకు ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం కూడా ఇచ్చారని తెలుస్తోంది. ఒప్పందాల ప్రకారం తను ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా.. ఇలా భారీ మొత్తాన్ని వెనక్కిచ్చేందుకు ముందుకొచ్చిన పీవీపీకి హ్యాట్సాఫ్ అనాల్సిందే. మరి ఈ నష్టాల్లో సూపర్ స్టార్ ఎంత భరించనున్నాడో!