మహేష్ బాబుకు చకచకా సినిమాలు చేయడంలో చాలానే గుర్తింపు ఉంది. ఒక సినిమా చేసేటప్పటికే మరో సినిమాను లైన్ లో పెట్టేసి ప్రీప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసేసి రెడీగా ఉడండం.. ఆ తర్వాతి ప్రాజెక్టుకు స్టోరీ డిస్కషన్స్ చేయడం సూపర్ స్టార్ కు అలవాటు. ఇంత స్పీడ్ గా ప్రాజెక్టులను లైన్ లో పెట్టే మరో హీరో టాలీవుడ్ లో కనిపించడు కూడా.
అయితే.. మహేష్ రీసెంట్ మూవీ భరత్ అనే నేను రిలీజ్ అయ్యి దాదాపు నెలన్నర కావస్తోంది. కానీ మన హీరో మరుసటి చిత్రం ఇంకా షూటింగ్ మొదలుకాలేదు. మహేష్25వ చిత్రంగా రూపొందనున్న ఈ ప్రాజెక్టుకు వంశీ పైడిపల్లి డైరెక్షన్ వహించనుండగా.. అన్ని పనులు పూర్తయినా షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. ఇందుకు.. మహేష్ తో గతంలో బ్రహ్మోత్సవం అంటూ సినిమా తీసిన ప్రొడ్యూసర్ పీవీపీ కారణం అనే రూమర్ వినిపిస్తోంది. ఆగడు ఫ్లాప్ తర్వాత.. మహేష్ తో రెండు సినిమాలకు ఒప్పందం చేసుకున్నారు పీవీపీ.
కానీ బ్రహ్మోత్సవం డిజాస్టర్ తర్వాత.. మహేష్ వేరే సినిమాల్లోకి వెళ్లిపోవడం.. తన బ్యానర్ పై సినిమా తీయకపోవడంపై ఆయన హర్ట్ అయ్యారట. పైగా వంశీ పైడిపల్లి సినిమాను తన బ్యానర్ కోసమే అని స్టోరీ డిస్కషన్స్ పూర్తి చేసి.. ఇప్పుడు దిల్ రాజు.. అశ్వినీదత్ లకు చేస్తుండడంపై కోర్టులో కేసు కూడా వేశారు పీవీపీ. జూన్ 4న ఈ సినిమా ఈ కేసుపై జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది. మహేష్ 25కు.. పీవీపీ ని కూడా ఓ నిర్మాతగా చేసే మధ్యవర్తిత్వం కూడా వర్కవుట్ కాలేదు. సూపర్ స్టార్ సినిమా షూటింగ్ పెండింగ్ లో ఉండిపోవడానికి.. ఒకరకంగా పీవీపీనే కారణం అంటున్నారు సినీ జనాలు.