‘బ్రహ్మోత్సవం’ డిజాస్టర్ అయిన నేపథ్యంలో పొట్లూరి వరప్రసాద్.. సినీ రంగం నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారని.. ‘పీవీపీ సినిమాస్’ ఇక చరిత్రే అని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ రూమర్లపై పీవీపీ స్పందించారు. తాను సినిమాలు మానేస్తున్నానన్నది రూమర్ మాత్రమే అని.. తనకలాంటి ఉద్దేశాలేమీ లేవని చెబుతూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారాయన. ఐతే ఇది తమిళ ఇండస్ట్రీని ఉద్దేశించి ఆయన ఇచ్చిన ప్రెస్ నోట్ కావడం విశేషం.
‘‘మా సంస్థ ఇకపై తమిళంలో సినిమాలు తీయదనన్నది ఎవరో గిట్టని వారు చేసిన దుష్ప్రచారమే. వాళ్లకు దీని వల్ల సొంత ప్రయోజనాలున్నాయి. ఐతే మేం వరుసగా సినిమాలు నిర్మించడానికి ప్రణాళికలతో ఉన్నాం. ఏ రంగంలో అయినా ఎత్తు పల్లాలు సహజం. వీటన్నింటికీ సిద్ధపడే సినీ రంగంలోకి వచ్చాం. త్వరలోనే మా సంస్థ నుంచి ఓ పెద్ద హీరో.. పెద్ద దర్శకుడి కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కబోతోంది. ఇప్పుడున్న హీరోలు.. దర్శకుల్లో చూస్తే ఇదే అతి పెద్ద కాంబినేషణ్’’ అని వెల్లడించారు పీవీపీ.
మొత్తానికి ఈ ప్రెస్ నోట్ తో తమ గురించి వస్తున్న రూమర్లకు తెరదించడంతో పాటు ఆసక్తికర చర్చకు తెరతీశాడు పీవీపీ. తమిళంలో పీవీపీ సెట్ చేసిన క్రేజీ కాంబినేషన్ ఎవరిదన్న చర్చ మొదలైంది. ‘బిగ్గెస్ట్ ఆఫ్ అవర్ టైమ్స్’ అన్నారంటే బహుశా సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేస్తున్నారేమో చూడాలి. ‘బ్రహ్మోత్సవం’ రిజల్ట్ చూశాక కూడా పీవీపీ మరో భారీ ప్రాజెక్టుకు రెడీ అవుతుండటం గొప్ప విషయమే.