ఇది ఊపిరి టైపా? క్షణం టైపా?

Update: 2016-10-31 17:30 GMT
తొలిరోజు రివ్యూయర్ల దగ్గర నుండి నాలుగు స్టార్లు.. తొలి వీకెండ్ కలక్షన్లు దాదాపు బాహుబలి మొదటి వీకెండ్ షేర్ ను బీచ్ చేసేంత రేంజులో కనిపించడం.. ఇవి రెండూ ఉన్నంత మాత్రాన సినిమాలు హిట్టయిపోయినట్లు కాదు. ఒకవేళ నమ్మకం లేకపోతే ఈ మధ్య కాలంలో రిలీజైన చాలా పెద్ద పెద్ద సినిమాల ట్రేడ్ హిస్టరీ ఓసారి తిరిగేయండి. అర్ధమైపోతుంది.

ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే.. ''కాష్మోరా'' సినిమా కలక్షన్లను అఫీషియల్ గా ప్రకటించేసింది పివిపి సంస్థ. 3 రోజుల్లోనే 11 కోట్లు కలెక్ట్‌ చేసిన కార్తీ - పివిపిల దీపావళి బ్లాక్‌ బస్టర్‌ 'కాష్మోరా' అంటూ ప్రచారంతో దంచికొడుతున్నారు. బాగానే ఉంది. అయితే గతంలో ఇదే విధంగా ''ఊపిరి'' సినిమా టైములో కూడా ప్రచారంతో హోరెత్తించారు. కాకపోతే ఊపిరి సినిమా 52 కోట్లు ప్రపంచవ్యాప్త (తెలుగు అండ్ తమిళ్) షేర్ ఫుల్ రన్ లో వసూలు చేసినా కూడా.. మొత్తం ప్రాజెక్టు కాస్టు 60 కోట్లను టచ్ చేయడం వలన.. ఆ సినిమా ఫీజిబుల్ కాలేదనేది ట్రేడ్ వర్గాల ఎనాలసిస్. తరువాత వచ్చిన ''క్షణం'' సినిమా మాత్రం.. కేవలం 1.5 కోట్లతో తీస్తే.. 10 కోట్ల వరకు రకరకాల వసూళ్ల రూపేణ నిర్మాత జేబులో వేసింది. ఇంతకీ ఇప్పుడు కాష్మోరా ఏ టైపు హిట్టు?

కాష్మోరా సినిమాను చాలా హై బడ్జెట్ తో రూపొందించారు. అందుకే సినిమా బ్లాక్ బస్టర్ అయితే కాని రికవరీ అంత ఈజీ కాదు అనే టాక్ ఉంది. అయితే సినిమా ఎబోవ్ యావరేజ్ టాక్ మాత్రమే వచ్చింది. అందుకే ఈ సినిమా ఊపిరి టైపులో సక్సెస్ అయినా కూడా లాభాలు రాకుండా ఆగిపోతుందా అనే సందేహం వచ్చింది జనాలకు. మరి క్షణం తరహాలో సినిమాకు విపరీతమైన ప్రాఫిట్స్ వస్తాయని కోరుకుందాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News