తెలంగాణ ముందస్తు ఎన్నికల సమయంలో బండ్ల గణేష్ చేసిన హడావిడీ అంతా ఇంతా కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని.. తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని టీవీ లైవ్ షోలలో తెగ రచ్చ చేసి కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే బ్లేడ్ తో గొంతు కోసుకుంటానని స్టేట్మెంట్లు ఇచ్చి అప్పట్లో సంచలనం సృష్టించాడు. ఫలితాలు తెరాసకు అనుకూలంగా రావడంతో సోషల్ మీడియాలో బండ్ల గణేష్ ని నెటిజనులు ఓ ఆట ఆడుకున్నారు. దీంతో ఆ ట్రోలింగ్ ని భరించలేక నన్నొదిలేయండి మహాప్రభో అంటూ చేతులెత్తేసిన బండ్ల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించి కొన్ని నెలల పాటు మీడియాకు కనిపించకుండా వెళ్లిపోయారు.
తాజాగా మళ్లీ సోషల్ మీడియా వేదికగా ఏపీ అధికార పార్టీపై సంచలన ట్వీట్ లు చేయడం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అత్యంత సన్నిహితులమని చెప్పుకుంటున్న కొంత మంది ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్లని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తాజాగా సోషల్ మీడియా ట్విట్టర్ లో బండ్ల గణేష్ బాంబు పేల్చారు. ప్రస్తుతం ఈ వార్త తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఏపీ సీఎం పేరుని అడ్డం పెట్టుకుని ఇండస్ట్రీ పెద్దలని బ్లాక్ మెయిల్ కు గురిచేస్తున్న వాళ్లని వైఎస్ జగన్ తగు విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నానని బండ్ల పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా వుంటే శుక్రవారం రాత్రి జూబ్లీ పోలీస్ స్టేషన్ లో బండ్లపై ఫైనాన్షియర్ కం నిర్మాత పీవీపీ పోలీస్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తనపై బెదిరింపులకు పాల్పడ్డాడని బండ్లపై కేసు నమోదు చేయడంతో ఆయన పరారీలో ఉన్నారని ప్రచారమైంది. అయితే ఈలోగానే బండ్ల ఇలా పక్క దారి పట్టించే ట్వీట్లు చేయడం చర్చనీయాంశమైంది. ఇక బండ్ల నిర్మాతగా విఫలమై చాలా డబ్బు నష్టపోవడంతో తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. మహేష్‌బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వు' చిత్రంతో మళ్లీ నటుడిగా కొత్త ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కాబోతోంది.