కింగ్ నాగార్జున డెసిషన్లు కరక్టా తప్పా? అనే విషయం మనం ఇప్పుడు చెప్పలేం. కాకపోతే గతాన్ని చూసి కాస్త విశ్లేషించవచ్చు. అదేంటంటే.. ఆయన తన సినిమా విషయంలో ఇప్పుడు అద్భుతమైన డెసిషన్లు తీసుకుంటున్నారు. కాని తన కొడుకుల విషయంలోనే.. సరైన గైడెన్స్ ఇవ్వట్లేదేమో అనేది వాదన.
ప్రస్తుతం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం.. అఖిల్ హీరోగా రెండో సినిమా ఎప్పుడు లాంచ్ అవుతుందనే. అయితే ఈ సినిమాను ఒక బడా ప్రొడ్యసర్ చేతిలో పెట్టినట్లు తెలుస్తోంది. ఆయనే పివిపి. మాంచి దమ్మున్న ప్రొడ్యూసర్. కాకపోతే ఇబ్బంది ఎక్కడ తలెత్తుతోంది అంటే.. అప్పట్లో నాగచైతన్య లాంచింగ్ సినిమాను దిల్ రాజు చేతుల్లో.. మొన్న అఖిల్ తొలిసినిమాను నితిన్ డాడీ సుదాకర్ రెడ్డి చేతిల్లో పెట్టారు. వీరిద్దరూ పెద్ద ప్రొడ్యూసర్లే. ఇప్పుడు అఖిల్ రెండో సినిమాను కూడా ఇలా పెద్ద ప్రొడ్యూసర్ల చేతిలోనే పెడుతున్నారు. సెంటిమెంటల్ గా పెద్ద నిర్మాతలు అచ్చిరానప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు నాగ్ అనేది అభిమానుల భయం.
కాని విషయం ఏంటంటే.. పెద్ద ప్రొడ్యూసర్లందరూ ఈ యంగస్టర్స్ కోసం కాస్త ఎక్కవగానే ఖర్చు పెట్టేస్తున్నారు కాని.. ఆ ఫోకస్ అంతా కథ మీద పెడితే మాత్రం సినిమాలు హిట్టయ్యే ఛాన్సుంటుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో..