సినీ నిర్మాత, నటుడిగానే కాకుండా రాజకీయాల్లోకీ అడుగుపెట్టి అట్టర్ ఫ్లాప్ అయిన బండ్ల గణేశ్... బండ్ల గణేశ్, ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత, వైసీపీలో కీలక నేతగా ఉన్న పొట్లూరి వరప్రసాద్ ల మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నిర్మించిన టెంపర్ సినిమాకు పీవీపీ నుంచి బండ్ల రుణం తీసుకుని, ఆ సిినిమాను పూర్తి చేసి భారీగానే లాభపడ్డాక కూడా పీవీపీ ఇచ్చిన రుణాన్ని పూర్తిగా తీర్చలేదట. తాను చెల్లించాల్సిన మొత్తంలో కొంత మొత్తాన్ని మాత్రమే తీర్చిన బండ్ల.. మిగిలిన మొత్తాన్ని ఎగ్గొట్టే ప్లాన్ లో భాగంగానే తన మనుషులను పీవీపీ ఇంటికి పంపి మరీ బెదిరింపులకు దిగిన వైనం ఇప్పుడు నిజంగానే సంచలనంగా మారిపోయింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ వివాదంగా మారిన ఈ వ్యవహారంలో బండ్ల గణేశ్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారిపోయింది. బండ్లకు రుణం ఇవ్వడమే తాను చేసిన తప్పా అన్న దిశగానూ ఇప్పుడు పీవీపీ మదనపడాల్సిన దుస్థితి వచ్చిందన వాదన కూడా వినిపిస్తోంది. తనకు ఏపీ హోం మినిస్టర్ సుచరితతో పాటు మరో కీలక మంత్రి బొత్స సత్యనారాయణ తెలుసంటూ పీవీపీ తనను బెదిరిస్తున్నారంటూ తనదైన శైలి ఆరో్పణలు చేసిన బండ్ల గణేశ్ అసలు రూపమేమిటో ఇప్పుడు బయటకు వచ్చేసింది. బండ్లకు డబ్బిచ్చి దానిని వసూలు చేసుకోలేక నానా తంటాలు పడటమే కాకుండా బండ్ల గణేశ్ మనుషుల చేతిలో బెదిరింపులకు గురైన పీపీపీనే స్వయంగా బయటకు వచ్చి ఈ మొత్తం తతంగాన్ని బయటపెట్టేశారు. పీవీపీ వాదన వింటే... బండ్ల గణేశ్ ఈ స్థాయి దగాకోరా? అన్న అనుమానాలు కలగక మానవన్న వాదనా వినిపిస్తోంది.
ఈ వివాదంలో అసలు ఏం జరిగిందన్న విషయానికి వస్తే... 2013లో షూటింగ్ మొదలైన టెంపర్ సినిమా కోసం పీవీపీ వద్ద కొంత మొత్తాన్ని బండ్ల గణేశ్ తీసుకున్నారు. 2015లో సినిమా రిలీజ్ అయ్యింది. ఈ క్రమంలో ఈ అప్పులో కొంత మొత్తాన్ని బండ్ల గణేశ్ తిరిగి ఇచ్చేశారు. అయితే రూ.7 కోట్ల మేర ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయింది. దీని కోసం పీవీపీ యత్నిస్తూనే ఉన్నారట. అయితే ఈ మొత్తాన్ని చెల్లించే విషయాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేసేస్తూ వస్తున్న బండ్ల... పీీవీపీ కార్యాలయ సిబ్బందితో మాట్లాడుతూనే ఆ డబ్బు ఎగ్గొట్టేందుకు యత్నించారట. అందులో భాగంగానే పీవీపీ తనను బెరిస్తున్నారని ఆరోపణలు చేసిన బండ్ల శుక్రవారం రాత్రి తన మనుషులను పీవీపీ ఇంటికి పంపారట. అలా వెళ్లిన బండ్ల మనుషులు పీవీపీని బెదిరించారు. దీంతో గత్యంతరం లేని పీవీపీ... పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బండ్లపై కేసు నమోదు చేసిన పోలీసులు... బండ్ల మనుషులపైనా కేసు పెట్టేశారు. ఈ మొత్తం విషయాన్ని వివరించిన పీవీపీ... అసలు తాను బండ్లను బెదిరించానన్నదే అబద్దమని, అవసరమైతే తన సెల్ ఫోన్ ను పరిశీలించుకోవచ్చని కూడా పీవీపీ సవాల్ విసిరారు. మొత్తంగా తీసుకున్న అప్పును తిరిగి చెల్లించకపోగా... దానిని ఎగ్గొట్టే క్రమంలో ఏకంగా పీవీపీపై అసత్య ఆరోపణలు చేయడంతో పాటుగా బెదిరింపులకు గురి చేసిన బండ్ల అడ్డంగా బుక్కైపోయారన్న మాట.