పి.వి.పి.సంస్థ అందరికీ సుపరిచితమే. ఆ సంస్థ కేవలం సినిమాలను నిర్మించడమే కాదు.. క్రీడలను ప్రోత్సహించడంలోనూ ముందుంది. పి.వి.పి. సంస్థ యజమాని ఓ బ్యాట్మింటన్ టీమ్ కు యాజమానిగా కూడా వ్యవహరిస్తున్నారు. దానిని బట్టే అర్థం అవుతోంది.. పి.వి.పి.సంస్థ క్రీడలను ఎంతగా ప్రోత్సహిస్తోందో. పి.వి.సింధు రియో ఒలంపిక్ లో సిల్వర్ మెడల్ ను గెలుచుకుని నగరానికి తిరిగొచ్చిన సందర్భంగా ఆ సంస్థ యజమాని పొట్లూరి వరప్రసాద్ పి.వి.సింధు - కోచ్ గోపీచంద్ లకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘భారతీయులు గర్వపడే విజయాన్ని సాధించినందుకు పి.వి.సింధు.. కోచ్ గోపీచంద్ లకు హృదయపూర్వక అభినందనలు. తన ప్రతిభ - పట్టుదల - అకుంఠిత దీక్షతో సింధు సాధించిన విజయం భారతీయులను ఆనంద సాగరంలో ముంచివేసింది. మహిళా సాధికారత - యువ భారతానికి ప్రపంచ స్థాయిలో సింధు ప్రతినిధిగా నిలిచింది. ఈ అద్భుత విజయం తర్వాత రియో నుంచి హైదరాబాద్ నగరానికి విచ్చేసిన సందర్భంగా తనకు నా అభినందనలు. మాతో పాటు రాబోయే తరాలకు సింధు ఒక ఇన్ స్పిరేషన్ గా నిలిచి నేటి సమాజంలో క్రీడలను... క్రీడాకారులను ప్రోత్సాహించేలా చేసింది. నాయకులు దేశాన్నినడిపిస్తారు. స్టార్స్ ఎంటర్ టైన్ చేస్తారు. సింధు... సచిన్... సైనాలు జాతి మత బేధాలు లేకుండా దేశ ప్రజలను మమేకం చేస్తారని’ కొనియాడారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘వ్యక్తిగతంగా బ్యాడ్మింటన్ టీం యజమాని కావడం వల్ల ఈ క్రీడతో నాకు చాలా అనుబంధం ఉంది. ఈ యువ బ్యాడ్మింటన్ అటగాళ్ళతో కలిసి ప్రయాణం చేయడం.. వాళ్ళ ప్యాషన్స్ ను దగ్గర నుండి చూడటం అనేది ఒక అద్భుతమైన ఘట్టం. ఒక గల్లి క్రీడాకారుడైనా.. ఓలిపింయన్ అయినా క్రీడాకారులకు తమ వంతు ప్రోత్సాహం అందించాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను. మనందరి ప్రార్థనలు - విషెష్ వాళ్ళకెంతో ప్రోత్సాహనిచ్చి విజయానికి దోహదపడటమే కాక వారి విజయాలు దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. దేశం తలెత్తుకుని గర్వపడేలా చేసిన సింధు - గోపిలకు నా ధన్యవాదాలు. మీలాంటి వాళ్ళతో పరిచయం ఉండటం మాకెంతో గర్వకారణం’ అంటూ తనకున్న పరిచయాన్ని ఆయన నెమరువేసుకున్నారు.